ఇందిరా మహిళా శక్తి భవన నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్

కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఇందిరా మహిళా శక్తి భవన నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు.

Update: 2024-11-21 09:59 GMT

దిశ, కామారెడ్డి : కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఇందిరా మహిళా శక్తి భవన నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. మహిళా శక్తి భవన నిర్మాణానికి కేటాయించే భూమిని గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..మహిళా శక్తి భవన నిర్మాణానికి పట్టణ సమీపంలోని జాతీయ రహదారి నం.44 ప్రక్కన సర్వే నెంబర్ 527 లో ఒక ఎకరం భూమి కేటాయించినట్లు కలెక్టర్ తెలిపారు. మహిళాశక్తి భవన నిర్మాణానికి ప్రభుత్వం 5 కోట్ల రూపాయలు కేటాయించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రంగనాథ్ రావు, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సురేందర్, పంచాయతీ రాజ్ ఈఈ దుర్గా ప్రసాద్, డిపిఎం సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.


Similar News