Revenue Department : రెవెన్యూ డిపార్ట్మెంట్లో వసూలు రాజాలు

రెవెన్యూ కార్యాలయాలకు వస్తున్న ప్రజలను పీడిస్తూ లంచాలు తీసుకుంటున్న కొందరు రెవెన్యూ అధికారులపై జుక్కల్ నియోజకవర్గ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు తనదైన తీరులో అధికారులను హెచ్చరించిన వీడియో కామారెడ్డి జిల్లాలో ఇప్పుడు సంచలనంగా మారింది

Update: 2024-07-28 16:36 GMT

దిశ,నిజాంసాగర్: రెవెన్యూ కార్యాలయాలకు వస్తున్న ప్రజలను పీడిస్తూ లంచాలు తీసుకుంటున్న కొందరు రెవెన్యూ అధికారులపై జుక్కల్ నియోజకవర్గ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు తనదైన తీరులో అధికారులను హెచ్చరించిన వీడియో కామారెడ్డి జిల్లాలో ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు మాట్లాడుతూ... రైతన్నలు సంతోషపడే విధంగా ప్రజా ప్రభుత్వంలో వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నాయని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రైతాంగానికి ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15 తారీకు లోపు రెండు లక్షల రుణమాఫీ చేసి తీరుతామని ఆ ప్రక్రియ త్వరలోనే పూర్తి అవుతుందని అన్నారు.

అన్ని వర్గాల ప్రజలకు ప్రాధాన్యత ఇస్తూ 2,91,159 కోట్లతో బడ్జెట్ ప్రవేశ పెట్టడం జరిగిందని గుర్తు చేశారు. ప్రజా ప్రభుత్వానికి మచ్చ తెచ్చే విధంగా జుక్కల్ నియోజకవర్గం లోని రెవెన్యూ కార్యాలయాల్లో కొంతమంది ఉద్యోగులు సామాన్య ప్రజల నుంచి లంచాలు వసూలు చేస్తూ ప్రజలను వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు నా దృష్టికి వచ్చిందని అన్నారు.ఇలాంటి పరిణామాలు నా నియోజకవర్గంలో అవినీతి అధికారులు ఉండడం దురదృష్టకరమైన బాధాకరమైన విషయమని ఆయన మాట్లాడారు. ప్రజల వద్ద నుండి లంచాలకు పాల్పడుతున్న అధికారుల చిట్టా నా దగ్గర ఉందని అన్నారు.

ఇకనైనా అవినీతి చేసే అధికారుల పనితీరు మార్చుకోకపోతే వారికి కఠిన చర్యలు తప్పవని జోష్యం చెప్పారు. ప్రభుత్వ అధికారులు ప్రజలకు పనిచేయడానికి ఉండాలి గాని ప్రజలను పీడించే విధంగా ఉండకూడదని ఆయన అన్నారు. ప్రజలు ఇకనుండి ఏ ఒక్క అధికారికి లంచం ఇవ్వాల్సిన అవసరం లేదని ఏ అధికారైనా లంచం అడిగినట్లయితే జుక్కల్ నియోజకవర్గ ప్రజలు నా దృష్టికి తీసుకురవాలని ప్రజలకు సూచించారు.


Similar News