ఆలూర్ మండల కేంద్రంలో ఘనంగా స్వచ్చదనం -పచ్చదనం కార్యక్రమం

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మక చేపట్టిన వన మహోత్సవంలో భాగంగా ఆలూర్ మండల కేంద్రంలో స్వచ్చదనం పచ్చదనం కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు.

Update: 2024-08-05 07:25 GMT

దిశ, ఆలూర్: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మక చేపట్టిన వన మహోత్సవంలో భాగంగా ఆలూర్ మండల కేంద్రంలో స్వచ్చదనం పచ్చదనం కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ప్రభుత్వం ఆదేశాల ప్రకారం.. స్థానిక ప్రజాప్రతినిధులతో ర్యాలీ నిర్వహించారు. ప్రాథమిక పాఠశాలలో పరిసరాలు శుభ్రం చేసి, పాఠశాల విద్యార్థులకు ఎంఈఓ రాజలింగం ఆధ్వర్యంలో వ్యక్తి పరిశుభ్రత గురించి, ప్లాస్టిక్ వాడకం పై దుష్ఫలితాలు గురించి, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఆ విధంగానే పారిశుద్ధ్య కార్మికులచే పరిసరాల పరిశుభ్రత, పిచ్చి మొక్కల తొలగింపు, తడి, పొడి చెత్తపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆలూర్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ముక్కెర విజయ్, మాజీ ఉప సర్పంచ్ దుమాజి శ్రీనివాస్, తహసీల్దార్ నరేష్, సెక్రటరీ రాజలింగం, కార్యదర్శి సంతోష్, కాంగ్రెస్ నాయకులు ఉదయ్, భాస్కర్, నవనీత్, సంజీవ్, ములకడి శ్రీనివాస్, ఆశ వర్కర్లు, అంగన్వాడీ టీచర్స్ గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.


Similar News