చికెన్ ఓ షాపులో రూ.160.. ఇంకో షాపులో రూ.180.. ఏది మంచిది..?

Update: 2024-08-26 14:23 GMT

దిశా, గాంధారి : దొరికిందే తరువాయి అన్నట్లుగా చికెన్ వ్యాపారస్తుల వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉంది. పేపర్ రేటుతో మాకేం సంబంధం లేదు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. చికెన్ రేటు తక్కువగా ఉన్న పేపర్ రేట్ తో సంబంధం లేకుండా చికెన్ వ్యాపారస్తులు దండిగా దండుకుంటున్నారు. ఒక ఊర్లోనే ఒక్కో షాపులో ఒక్కో తీరుగా రేట్లు ఉన్నాయి. ఒక షాపు వద్ద కిలో చికెన్ ధర రూ.160 కాగా.. ఇంకో షాప్ లో రూ.180 కేజీ చికెన్ అమ్మబడుతుందని బోర్డులు దర్శనమిస్తున్నాయి. అంటే అసలు రేటు ఎంతో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలోని చికెన్ సెంటర్ లో చికెన్ పేపర్ రేటు రూ.150 ఉండగా చికెన్ సెంటర్ షాపులలో మాత్రం రూ.180 కిలో చొప్పున అమ్ముతున్నారు. ఇందులో వెంకాబ్ చికెన్ రూ.190 పేపర్ రేటు ఉండగా రూ.180కి అమ్ముతున్నారు. అంటే పేపర్ రేట్ కంటే పది రూపాయలు తక్కువగా అమ్ముతున్నార. దీంతో రూ.160 రూపాయల చికెన్ మంచిదా.. లేకపోతే రూ.180 చికెన్ మంచిదా అని చికెన్ ప్రియులు చికెన్ తినేందుకు వెనక ముందు అవుతున్నారు. చికెన్ రేటు తగ్గి దాదాపు మూడు వారాలు గడుస్తున్న ఇప్పటికీ పాత రేటే కొనసాగిస్తూ అమ్మడం జరుగుతుంది. మండల కేంద్రంలోని దాదాపు 44 గ్రామపంచాయతీ కలిపి ఉండడంతో మేజర్ మండలంగా ఉన్న గాంధారి దాదాపు రోజు ఒక్కో షాపులో మామూలు రోజుల్లో 50 కిలోల పైన అమ్ముతున్నారు.

అయితే కేవలం ఆదివారం అంగడి రోజు కావడంతో ఒక్కో షాపుల్లో దాదాపు క్వింటాలుకు పైగా చికెన్ అమ్మడం జరుగుతుంది. ఇందులో కొసమెరుపు ఏమిటంటే 180 కేజీ కాబట్టి 20 రూపాయలు చిల్లర లేవు 200 రూపాయల చికెన్ తీసుకోండి లేకపోతే చిల్లర ఇవ్వండి అంటూ అదనంగా తమ వ్యాపారాన్ని ఇంకా మెరుగుపరచుకుంటున్నారు. దినిపై ఇప్పటికైనా విలేజ్ డెవలప్మెంట్ కమిటీ స్పందించి ప్రజలకు తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.


Similar News