ఎల్లారెడ్డి గడ్డపై బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయం

ఎల్లారెడ్డి గడ్డపై గులాబీ జెండా ఎగరడం ఖాయమని ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే జాజుల సురేందర్ అన్నారు.

Update: 2023-10-03 14:38 GMT

దిశ, తాడ్వాయి : ఎల్లారెడ్డి గడ్డపై గులాబీ జెండా ఎగరడం ఖాయమని ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే జాజుల సురేందర్ అన్నారు. తాడ్వాయి మండలంలో మంగళవారం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమాలకు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎల్లారెడ్డి గడ్డపై మరో మారు గులాబీ జెండా ఎగరడం ఖాయమని అన్నారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందిందని అన్నారు. మండలంలోని అన్ని గ్రామాలలో 18.90 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేపట్టడం జరిగిందని తెలిపారు. అనంతరం మండలంలోని బ్రహ్మాజీవాడి గ్రామంలో బతుకమ్మ చీరలను పంపిణీ చేశామన్నారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన

మిషన్ భగీరథ నీళ్లు మండలంలోని అన్ని గ్రామాలలో నీటి కొరతను తీర్చిందన్నారు. కాంగ్రెస్ పార్టీ రైతును రాజు చేస్తామని మాయ మాటలు చెప్పి చేయలేన్నారు. ప్రతిపక్ష పార్టీలు కల్లబొల్లి మాటలతో గ్రామాలలో ప్రజలను మభ్యపెట్టడానికి వస్తున్నాయని, జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ కౌడి రవి, జెడ్పీటీసీ రమాదేవి నారాయణ ,ఏఎంసీ చైర్మన్ పులగం సాయి రెడ్డి, వైస్ ఎంపీపీ నర్సింలు, మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు మద్ది మహేందర్ రెడ్డి, డీసీఎంఎస్ డైరెక్టర్ కపిల్ రెడ్డి, బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి గోపాల్ రావు, ఎంపీటీసీలు, సర్పంచులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News