బోదన్ ఎంఎల్ఎస్ పాయింట్ ఇంచార్జి సస్పెన్షన్

ఎలక్షన్ కోడ్ తరువాత అధికారుల అవినీతి అక్రమాలపై జిల్లా కలెక్టర్ కొరడా ఝళిపిస్తున్నారు.

Update: 2023-12-13 12:41 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : ఎలక్షన్ కోడ్ తరువాత అధికారుల అవినీతి అక్రమాలపై జిల్లా కలెక్టర్ కొరడా ఝళిపిస్తున్నారు. బోధన్ ఎంఎల్ఎస్ పాయింట్ ఇంచార్జిగా పని చేస్తున్న డీటీ అజయ్ కుమార్ ను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. అక్టోబర్ 16న బోధన్ పట్టణంలోని ఒక స్కూల్ కు సంబంధించిన మధ్యాహ్న భోజన బియ్యం మూమెంట్ ముగిసిన తర్వాత ప్రైవేట్ హమాలీ ద్వారా తరలించడంతో పోలీసులు పట్టుకున్నారు. సంబంధిత బియ్యం ప్రభుత్వ బియ్యం కావడంతో ఈ మేరకు జిల్లా అధికారులకు సమాచారం అందించారు.

    పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేయగా దానిపై జిల్లా కలెక్టర్ అధికారులతో విచారణ జరిపించారు. బోధన్ ఎంఎల్ఎస్ పాయింట్ ఇంచార్ఝిగా ఉన్న అజయ్ కుమార్ ఆదేశాల మేరకే ప్రైవేట్ ఆటోలో ప్రైవేట్ హమాలీ 16 క్వింటాళ్ల బియ్యాన్ని తరలిస్తున్నట్లు విచారణలో తేలింది. విచారణ నివేదిక ఆధారంగా బోధన్ ఎంఎల్ఎస్ పాయింట్ ఇంచార్జి డీటీ అజయ్ కుమార్ పై వేటు పడింది. బోధన్ ఎంఎల్ఎస్ పాయింట్ కు నవీపేట్ ఎంఎల్ఎస్ పాయింట్ ఇంచార్జి గంగాధర్ ఇంచార్జి బాధ్యతలు అప్పజెప్పారు. 


Similar News