పూలను పూజించి, ప్రకృతిని ప్రేమించే గొప్ప పండుగ బతుకమ్మ : ఆకుల లలిత

నిజామాబాద్ నగరంలోని కంటేశ్వర్ లో తెలంగాణ రాష్ట్ర మహిళా సహకార అభివృద్ధి సంస్థ చైర్ పర్సన్ ఆకుల లలిత బతుకమ్మ సంబరాలను నిర్వహించారు.

Update: 2022-09-25 10:01 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ నగరంలోని కంటేశ్వర్ లో తెలంగాణ రాష్ట్ర మహిళా సహకార అభివృద్ధి సంస్థ చైర్ పర్సన్ ఆకుల లలిత బతుకమ్మ సంబరాలను నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ రాష్ట్ర ప్రజలకు, ఆడపడుచులకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. పువ్వులను పూజించే గొప్ప పండగ బతుకమ్మ అన్నారు. మన పండగ.. మన సంస్కృతి.. మన సాంప్రదాయానికి ప్రతీక అని పేర్కొన్నారు. ఆడపడుచుల ఔన్నత్యానికి సూచిక, తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాల‌కు, ఆడపడుచుల ఔన్నత్యానికి ప్రతీక అయిన‌ బతుకమ్మ పండుగను జిల్లా ప్రజలందరూ సంతోషంగా జరుపుకోవాలని ఆమె పేర్కొన్నారు. బతుకమ్మ పండుగ ప్రారంభం సందర్భంగా జిల్లా ప్రజలకు, ఆడపడుచులకు శుభాకాంక్షలు తెలిపారు. ఎంగిలి పూలను వెదజల్లుకొనే అమావాస్య నుంచి తొమ్మిది రోజులపాటు ఆడబిడ్డ‌లు అంద‌రూ క‌లిసి తీరొక్క పూలు, తీరొక్క రంగులతో ఆడుకునే గొప్ప‌ పండగ బతుకమ్మ అని చెప్పారు.

మహిళలు ఎంతో ఇష్టంతో పూలను పేర్చి, గౌరమ్మను తీర్చి కోరికలు ఫలించాలనే నమ్మకంతో ఈ బతుకమ్మ పండుగ చేసుకుంటారన్నారు. దేశంలో పూలను పూజించి, ప్రకృతిని ప్రేమించే గొప్ప పండుగ బతుకమ్మ అని, ఇలాంటి సంస్కృతి మన తెలంగాణలో ఉందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి బతుకమ్మ పండుగను అధికారికంగా నిర్వహిస్తున్నామ‌ని, రాష్ట్ర పండుగగా గుర్తించామ‌ని చెప్పారు. ప్రతి ఏటా బతుకమ్మ కానుకగా ఆడపడుచులకు చీరలు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఈ పండుగను ప్రజలందరు వేడుకగా, ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్వర్ణలత , అపర్ణ, ప్రియ ,గంగామణి మహిళలు స్థానిక మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News