చిత్తూ చిత్తుల బొమ్మ శివునీ ముద్దుల గుమ్మా..

చిత్తూ చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మా బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన రాగి బిందే తీస్తే రమణీ నీళ్లకు వొతే రాములోరు ఎదురాయే నమ్మొ ఈ వాడలోన అంటూ మహిళలు పాటలు పాడుతూ ఆటలు ఆడారు.

Update: 2022-10-02 15:16 GMT

దిశ, భీమ్‌గల్ : చిత్తూ చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మా బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన రాగి బిందే తీస్తే రమణీ నీళ్లకు వొతే రాములోరు ఎదురాయే నమ్మొ ఈ వాడలోన అంటూ మహిళలు పాటలు పాడుతూ ఆటలు ఆడారు. భీమ్‌గల్ పట్టణంతో పాటు అన్ని గ్రామాలలో బతుకమ్మ సంబురాలు ఘనంగా నిర్వహించారు. భీమ్‌గల్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నందిగల్లీలోని నందిశ్వరా ఆలయం ఎదుట ఆడబిడ్డలు బతుకమ్మలు ఆడేందుకు అన్ని ఏర్పాట్లు చేసారు.

రంగు రంగుల పూలతోటి తయారు చేసిన ఆడపడుచులు బతుకమ్మ సంబురాల్లో మునిగితేలారు. బతుకమ్మ పండుగ సందర్బంగా పట్టణంలో పండుగ వాతావరణం నెలకొంది. ఆడపడుచులకు మున్సిపల్ చైర్ పర్సన్ కన్నె ప్రేమలత బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. బతుకమ్మలు ఆడిన తదుపరి నందిగల్లీలో ఏర్పాటు చేసిన నీటి తొట్టిలో గ్రామాల్లో చెరువుల్లో బతుకమ్మలను నిమజ్జనం చేశారు.

Tags:    

Similar News