Banswada MLA :రైతుల సంక్షేమమే,కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం
వరుణ దేవుడు కరుణించి రైతు కుటుంబంలో
దిశ,నిజాంసాగర్: వరుణ దేవుడు కరుణించి రైతు కుటుంబంలో సంతోషాలను నింపాడని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ అన్నారు. ఆయన బుధవారం ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు తో కలిసి నిజాంసాగర్ ప్రాజెక్టు ఒక వరద గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. గంగమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించి రైతులకు కాపాడాలని కోరారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ..నిజాం ప్రభుత్వం హయంలో నిర్మించిన అతి పురాతన ప్రాజెక్టు నిజాంసాగర్ అని అన్నారు. జుక్కల్ నియోజకవర్గంలో సుమారుగా 7 వేల ఎకరాలు,బాన్సువాడ 90 వేల ఎకరాలు,బోధన్ 30 వేల ఎకరాలకు సాగు నీరు పంటలు పండిస్తున్నారు అన్నారు. అన్నం పెట్టే రైతులకు నీరు అందిస్తే చాలు బంగారం పండిస్తారని కొనియాడారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ప్రాజెక్టు నిండు కుండను తలపిస్తోందని అన్నారు. మొదటి విడత నీటి విడుదలకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు నీటిని విడుదల చేసుకుని రైతులను కాపాడుకున్నామని అన్నారు. నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు. నిజాంసాగర్ ప్రాజెక్టు పర్యాటక కేంద్రానికి పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు దృష్టికి తీసుకెళ్లనున్నట్లు పేర్కొన్నారు.
నిజాంసాగర్ ప్రాజెక్టు లోకి ఎగువ ప్రాంతం నుండి 29,700 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1405.00అడుగులు కాగా ప్రస్తుతం 1403.68అడుగుల నీరు నిల్వ ఉంది. అదేవిధంగా పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 17.802 టీఎంసీల కాగా ప్రస్తుతం 15.916 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఒక వరద గేటు ఎత్తి 2000క్యూసెక్కుల నీటిని మంజీరా నదిలోకి విడుదల చేస్తున్నారు. సింగూర్ ప్రాజెక్టు నీటిని విడుదల చేయడంతో ముందస్తుగా నిజాంసాగర్ ప్రాజెక్ట్ నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు గేట్లు వదలడంతో దిగువన మంజీరా నది పరివాహక ప్రాంత ప్రజలు,రైతులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి చీకోటి జయ ప్రదీప్,కాంగ్రెస్ పార్టీ నాయకులు మండల అధ్యక్షులు రవీందర్ రెడ్డి,వకీల్ రాంరెడ్డి,కృష్ణారెడ్డి,అనీస్ పటేల్,ప్రజా పండరి,గాండ్ల రమేష్, అజారుద్దీన్,నాగభూషణం,కాలేక్,రామకృష్ణ,అబ్దుల్ జమీల్,రాము రాథోడ్, లాల్ సింగ్,చింతకింది శేఖర్,శ్యామ్,మెగారం శ్రీనివాస్,బొజ్జ అంజయ్య,జిల్లా నీటి పారుదల శాఖ చీఫ్ ఇంజనీర్ శ్రీనివాస్,బాన్సువాడ సూపర్డెంట్ డివిజనల్ ఇంజనీర్ వాసంతి, ఈఈ సోలోమన్, ఏఈఈ శివ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.