జీఎస్ ఎనలిస్ట్ ఉద్యోగావకాశాల కోసం కృషి చేస్తాం.. డాక్టర్ సుధాకర్ గౌడ్

ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగావకాశాలు కల్పించడానికి తమ వంతు కృషి చేస్తామని జియో ఇన్ఫర్మేటిక్స్ హెచ్ ఓడి అన్నారు.

Update: 2022-09-23 12:59 GMT

దిశ, భిక్కనూరు : ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగావకాశాలు కల్పించడానికి తమ వంతు కృషి చేస్తామని జియో ఇన్ఫర్మేటిక్స్ హెచ్ ఓడి డాక్టర్ సుధాకర్ గౌడ్ అన్నారు. శుక్రవారం భిక్కనూరు మండలం బీటీఎస్ చౌరస్తాలో ఉన్న సౌత్ క్యాంపస్ లో, జియో ఇన్ఫర్మేటిక్స్ ద్వితీయ సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీఐఎస్, రిమోట్ సెన్సింగ్, జీపీఎస్ పరిజ్ఞానంతో ప్రభుత్వ ప్రైవేటు రంగాలలో ఉన్నతమైన ఉద్యోగావకాశాల పై విద్యార్థులకు వివరించారు. పీజీ పూర్తి చేసిన తర్వాత, రీసెర్చ్ చేసి విద్యారంగంలో ఏ విధంగా అభివృద్ధి చెందారన్న విషయాలను వివరించారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ జిల్లా కార్యాలయంలో జీఎస్ ఎనలిస్ట్ ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి తమ వంతు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కవితా తోరణ, డాక్టర్ ఎస్ నారాయణ గుప్తా, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.

Tags:    

Similar News