Illegal construction: జర్నలిస్ట్ కాలనీలో అక్రమ నిర్మాణం పై అధికారుల నోటీసు.. పనుల నిలిపివేత

ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని జర్నలిస్ట్ కాలనీలో ఓ ప్రధాన ఆసుపత్రి లైన్ లో బహుళ అంతస్తుల నిర్మాణం అనుమతులు జరుగుతున్నాయి.

Update: 2024-07-19 11:43 GMT

దిశ, ఆర్మూర్ : ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని జర్నలిస్ట్ కాలనీలో ఓ ప్రధాన ఆసుపత్రి లైన్ లో బహుళ అంతస్తుల నిర్మాణం అనుమతులు జరుగుతున్నాయి. ఈ అక్రమ పనులకు ఎమ్మెల్యే పీఏ ఆజ్యం పోస్తున్నాడని ఎమ్మెల్యే పేరును బదనాం చేస్తున్నాడని దిశలో మంగళవారం ప్రచురితమైన కథనంతో ఆర్మూర్ మున్సిపల్ అధికారులు శుక్రవారం స్పందించారు. ఆక్రమ నిర్మాణాలు చేపడుతున్న ఆ నిర్మాణదారులకు నోటీసు అందజేసి.. ఆక్రమ నిర్మాణ పనులను శుక్రవారం నిలిపి వేయించారు. ఆక్రమ నిర్మాణదారుడికి మున్సిపల్ కమిషనర్ రాజు టిపిఓ హరీష్ చేత నోటీసును అందజేయించి ఆ నిర్మాణ పనులను నిలిపి వేయించారు. ఆ నిర్మాణానికి సంబంధించిన పూర్తిస్థాయి అనుమతి పత్రాలను చూయించిన తర్వాతే పనులను చేయించాలని టిపిఓ హరీష్ కు మున్సిపల్ కమిషనర్ రాజు సూచించారు.


Similar News