ప్రజలు కల్పితాలు కాకుండా చరిత్రను తెలుసుకోవాలి..

కామారెడ్డి జిల్లా కేంద్రంలో బుధవారం అశోక విజయదశమి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.

Update: 2022-10-05 08:44 GMT

దిశ, కామారెడ్డి రూరల్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో బుధవారం అశోక విజయదశమి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా సామ్రాట్ అశోకుడి చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన చరిత్రను ప్రజలకు వివరించారు. ప్రజలందరూ చరిత్ర తెలుసుకోవాలని, కల్పితాల వైపు వెళ్లొద్దని కామారెడ్డి జిల్లా సామ్రాట్ అశోక విజయ్ దివస్ నిర్వహణ కమిటీ నాయకులు ఆకుల బాబు, మల్లన్న, బుల్లెట్ అన్నారు.

అశోక చక్రవర్తి కళింగ యుద్ధం కంటే ముందు రాజ్యకాంక్షతో యుద్ధాలు చేస్తూ రక్తాన్ని ఏరులై పారిస్తూ ఉండేవారన్నారు. కళింగ యుద్ధాన్ని చూసి బౌద్ధ బిక్షువు బోధనతో అర్థ్యాన్ని స్వీకరించారన్నారు. ఆ రోజు నుండి తాను గాని, తన వంశస్థులు గానీ యుద్ధాన్ని నిషేధిస్తున్నట్టు అశోకుడు పేర్కొన్నారన్నారు. శాంతి ద్వారా మాత్రమే ప్రజలు సమానంగా, స్వతంత్రంగా, సంతోషంగా జీవిస్తారని తాను నమ్ముతూ హింసా విధానాన్ని వదిలేశాడని అశోకుడు చేసిన వాగ్ధానమే విజయదశమి అని, ఈ పండగను వేల సంవత్సరాలుగా మన పూర్వికులు నిర్వహించు కుంటున్నారన్నారు.

శాంతి, స్వాతంత్రము, సమానత్వము అనే ప్రయోజనాల మీద సమాజ నిర్మాణం జరగాలని కోరుకున్నదే ఈ విజయదశమి పండగ అన్నారు. దీన్నే ఆశోక విజయదశమి అని లేదా దమ్మ విజయ దినోత్సవంగా కూడా జరుపుకుంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాజనర్సింలు, నరేందర్, నాంపల్లి, ప్రసన్నకుమార్, యశ్వంత్, ప్రభాకర్, స్టాలిన్, పవన్, సురేష్ తరితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News