అర్జీలను సత్వరమే పరిష్కరించాలి

ప్రజావాణి కార్యక్రమంలో వచ్చే సమస్యలకు అధిక ప్రాధాన్యతనిస్తూ వచ్చిన ఫిర్యాదులకు సత్వరమే పరిష్కార మార్గం చూపాలని జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి అధికారులను ఆదేశించారు.

Update: 2024-03-04 12:04 GMT

దిశ, సిద్దిపేట ప్రతినిధి : ప్రజావాణి కార్యక్రమంలో వచ్చే సమస్యలకు అధిక ప్రాధాన్యతనిస్తూ వచ్చిన ఫిర్యాదులకు సత్వరమే పరిష్కార మార్గం చూపాలని జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి అధికారులను ఆదేశించారు. సిద్దిపేట కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం జరిగింది. ప్రజావాణి లో ప్రజల నుండి ఫిర్యాదులు, వినతులను జిల్లా అదనపు కలెక్టర్ గరిమా అగ్రవాల్ తో కలిసి జిల్లా కలెక్టర్ స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ..

    జిల్లా నలుమూలల నుంచి సమస్యల పరిష్కారం కోరుతూ ప్రజావాణికి ప్రజలు ఆర్జీలు అందజేస్తారన్నారు. అధికారులు వారి శాఖల వారీగా స్వీకరించిన ఫిర్యాదులపై సానుకూలంగా వ్యవహరించడంతో పాటు సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 42 ఫిర్యాదులు అందినట్లు కార్యాలయ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఆర్ఓ నాగ రాజమ్మ, డీఆర్డీఏ పీడీ జయదేవ్ ఆర్యా, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. 


Similar News