పురాతన కట్టడాలను కాపాడుకోవాలి

పురాతన కట్టడాలను కాపాడుకోవాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సూచించారు.

Update: 2024-04-06 10:05 GMT

దిశ, లింగంపేట్ : పురాతన కట్టడాలను కాపాడుకోవాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సూచించారు. లింగంపేట్ మండల కేంద్రంలోని నాగన్న బావిలో శనివారం ఉదయం మండల స్థాయి అధికారులు, ఉపాధి సిబ్బంది, ఐకేపీ సిబ్బందితో కలిసి రెండు గంటల పాటు జిల్లా కలెక్టర్ పూడికతీత పనులు శ్రమదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పురాతన కట్టడాలు చరిత్రకు సాక్ష్యం అన్నారు. వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు. నాగన్న బావిలో పూడిక తీయడం వల్ల స్వచ్ఛమైన నీరు నిలువ ఉంటుందన్నారు. అలాగే భూగర్భ జలాలు పెంపొందుతాయని వెల్లడించారు.

    మండల స్థాయి అధికారులతో పాటు యువకులు శ్రమదానంలో పాల్గొనడం వల్ల రెండు రోజుల్లో కావలసిన పనిని రెండు గంటల్లో పూర్తి చేసినట్లు ఆయన వెల్లడించారు. స్వచ్ఛంద కార్యక్రమాల్లో యువత పాల్గొనడం అభినందనీయమన్నారు. నాగన్న బాబుని పర్యాటకంగా అభివృద్ధి చేపడుతున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో పాల్గొన్న యువకులను కామారెడ్డి జిల్లా కలెక్టర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో భాగంగా నాగన్న బావి పరిసరాల్లో మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఎంపీడీవో నరేష్, తహసీల్దార్ నరేందర్, ఏపీఎం శ్రీనివాస్, ఏపీఓ అన్నపూర్ణ, పంచాయతీ కార్యదర్శి శ్రవణ్ కుమార్ తో పాటు గ్రామ సమాఖ్య అధ్యక్షులు, మహిళలు, ఉపాధి హామీ పథకం క్షేత్ర సహాయకులు, రెవెన్యూ సిబ్బంది తోపాటు ఉపాధి కూలీలు పాల్గొన్నారు. 


Similar News