వారి బెదిరింపులకు భయపడి వ్యక్తి సూసైడ్..

రియల్ వ్యాపారుల బెదిరింపులకు భయపడి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.

Update: 2023-04-25 14:05 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్: రియల్ వ్యాపారుల బెదిరింపులకు భయపడి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నిజామాబాద్ నగరంలోని కోటగల్లికి చెందిన బిల్లా రాజేశ్వర్.. నాగారం ప్రాంతంలో ప్లాట్ కొనుగోలు చేశాడు. దానిని రియల్ వ్యాపారులు రిజిస్ట్రేషన్ చేయకపోగా బెదిరించడంతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ నెల 21న ఇంటి నుంచి కనిపించకుండాపోయిన వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడంతో ఈ సంఘటన విషాదంతంగా ముగిసింది.

నగరంలోని హిమ్మాత్ వాలా బీడీ కంపెనీలో అటెండర్ గా పని చేస్తూ కుటుంబాన్ని పోశించుకుంటున్నాడు. గతేడాది 2 లక్షలు పెట్టి నాగారం బ్రహ్మంగారి ఆలయం వద్ద నరాల రత్నాకర్, రవీంధర్, మరో మహిళ వద్ద నుంచి ప్లాట్ ను కొనుగోలు చేశాడు. ప్లాట్ తాలుకు డబ్బులను చెల్లించినప్పటికీ సంబంధిత బాధ్యులు మాత్రం ప్లాట్ ను రిజిస్ట్రేషన్ చేయలేదు.

ఇదే విషయమై ఈ నెల 21న రాజేశ్వర్ వారిని నిలదీశాడు. దాంతో వారు బెదిరించడంతో మనస్థాపం చెందిన రాజేశ్వర్ సూసైడ్ నోట్ రాసి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. సోమవారం రాత్రి మాక్లూర్ మండలం దాస్ నగర్ శివారులోని ఓ చెట్టుకు రాజేశ్వర్ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు సమాచారం అందించారు. పోలీసులు స్థానికంగా దొరికిన సమాచారం మేరకు కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా వారు ఆత్మహత్య చేసుకున్నది రాజేశ్వర్ గా గుర్తించారు. అతని తనయుడు రోహిత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు మాక్లూర్ ఎస్సై యాదగిరి గౌడ్ తెలిపారు.

Tags:    

Similar News