బోధన్ లో కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ దిష్టిబొమ్మ దహనం

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ఒక కుటుంబానికి మూడు సిలిండర్లు మాత్రమే ఇస్తామని, అదనంగా ఎవరైనా తీసుకున్నట్లయితే దానికి 500 రూపాయలు అదనంగా చెల్లించాలని ప్రకటించడాన్ని మహిళలు వ్యతిరేకిస్తున్నారు.

Update: 2022-10-12 12:01 GMT

దిశ, బోధన్ : కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ఒక కుటుంబానికి మూడు సిలిండర్లు మాత్రమే ఇస్తామని, అదనంగా ఎవరైనా తీసుకున్నట్లయితే దానికి 500 రూపాయలు అదనంగా చెల్లించాలని ప్రకటించడాన్ని మహిళలు వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలోనే బుధవారం ప్రగతిశీల మహిళా సంఘం బోధన్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా పట్టణ కమిటీ అధ్యక్షురాలు బి.నాగమణి మాట్లాడుతూ సంవత్సరానికి మూడు సిలిండర్లు మాత్రమే ప్రస్తుత ధరకు ఇస్తామని నిర్మలా సీతారామన్ అన్నారన్నారు.

మూడు కన్నా ఎక్కువ సిలిండర్లు తీసుకున్నట్లయితే ఒక్కో సిలిండర్ కు 500 రూపాయలు అధికంగా చెల్లించాలని నిర్మల సీతారామన్ ప్రకటించారని తెలిపారు. ఈ ప్రకటనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, 2014లో బీజేపీ అధికారంలోకి రాకమునువు బీజేపీ అధికారంలోకి వస్తే ధరలను తగ్గిస్తామని చెప్పిన మాటకు విరుద్ధమైనదని గుర్తు చేశారు. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సిలిండర్ పై ఉన్న సబ్సిడీని తగ్గిస్తూ, తగ్గిస్తూ విపరీతంగా పెంచేశారని మండిపడ్డారు.

ఒక గ్యాస్ ధరనే కాకుండా పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు నిత్యావసర సరుకుల ధరలన్నింటినీ పెంచి దేశ ప్రజలపై పెను భారాన్ని కేంద్ర ప్రభుత్వం మోపిందన్నారు. నిర్మలాసీతారామన్ చేసిన ప్రకటనను వెంటనే ఉపసంహరించుకోవాలని లేనట్లయితే మహిళా సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పీఓడబ్ల్యూ నిజామాబాద్ జిల్లా కమిటీ నాయకులు బి పాషా బేగం, భాగీరథబాయి, ఈరమని, లక్ష్మి, సుజాత, సూర్య కళ, గంగామణి, కళావతి, లింగామని, రమా, సావిత్రి, అనిషా, తబస్సుం బేగం తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News