'శిథిలావస్థలో ఉన్న పాఠశాలకు అదనపు గదులు కేటాయించండి'

ఆర్మూర్ మండలంలోని చేపూర్ గ్రామంలో గత 25 సంవత్సరాల నుండి స్మశాన వాటికకు సంబంధించిన రోడ్డు ఇబ్బందులను, శిథిలావస్థలో ఉన్న పాఠశాలకు అదనపు గదులు గురించి ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ప్రొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు స్థానికులు.

Update: 2024-07-17 13:15 GMT

దిశ, ఆలూర్ : ఆర్మూర్ మండలంలోని చేపూర్ గ్రామంలో గత 25 సంవత్సరాల నుండి స్మశాన వాటికకు సంబంధించిన రోడ్డు ఇబ్బందులను, శిథిలావస్థలో ఉన్న పాఠశాలకు అదనపు గదులు గురించి ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ప్రొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు స్థానికులు. దీంతో వెంటనే స్పందించి చెపూర్ గ్రామాన్ని సందర్శించి అక్కడ ఉన్న పరిస్థితులను తెలుసుకొని, అధికారులతో మాట్లాడి గ్రామస్తులకు ఉపయోగపడేలా చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిన్నారెడ్డి, ఆర్మూర్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇస్సపల్లి జీవన్, ఆర్మూర్ మున్సిపల్ చైర్మన్ వన్నెల్ దేవి అయ్యప్ప శ్రీనివాస్, ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు సాయిబాబా గౌడ్, ఆర్మూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ మున్నా పాల్గొన్నారు.


Similar News