Collector : కలెక్టర్ రాకతో అధికారుల అలర్ట్..

కలెక్టర్ రాకతో ఆయా శాఖల అధికారులు అలర్ట్ అయ్యారు దీంతో అధికారులు హైరానా పడ్డారు.

Update: 2024-07-23 12:54 GMT

దిశ, గాంధారి : కలెక్టర్ రాకతో ఆయా శాఖల అధికారులు అలర్ట్ అయ్యారు దీంతో అధికారులు హైరానా పడ్డారు. బస్టాండ్ లోని టాయిలెట్లను చూసి మరి ఇంత ఘోరమా అని ఆర్టీసీ అధికారులకు ప్రశ్నించారు. వివరాల్లోకి వెళితే కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వన్ మంగళవారం పర్యటించారు. ముందుగా ఐకేపీ సెంటర్ వాలంటీర్లతో మాట్లాడి వాళ్ళ సమస్యలను తెలుసుకొని అటు పై ఆర్టీసీ ప్రాంగణంలో గల ఐకేపీ వారిచే క్యాంటీన్ ఏర్పాటు చేయాలని సదుద్దేశంతో బస్టాండ్ కాంప్లెక్స్ లోని కిరాయిల గురించి అడగడంతో 8000 ప్రస్తుతం ఉందని డీఎం తెలుపగా అంతలా కిరాయి మొత్తం మేము చెల్లించుకోలేమని ఐకేపీ సంఘ సభ్యులు తెలిపారు. అంతేకాకుండా రోడ్డుకిరువైపులా నాటవలసిన చెట్లు గురించి గ్రామపంచాయతీ సెక్రటరీ నాగరాజుని అడిగి వివరాలు తెలుసుకున్నాడు.

బస్టాండ్ లోని టాయిలెట్ లపై అసంతృప్తి...

మరి ఇంత దారుణంగా టాయిలెట్లలను నిర్వహిస్తున్నారని కలెక్టర్ సంబంధిత అధికారులను ప్రశ్నించారు. ఇలాంటి సంఘటనలు పునరావృత్తం కాకుండా చూసుకుంటామని డీఎం భాగ్యలక్ష్మి తెలిపారు. అయితే అప్పటికే కొంతమంది ఆర్టీసీ ప్రాంగణంలో మడిగలు వేలంపాటల్లో జరిగిన యాక్షన్కు కొందరు 20,000 ముందస్తుగా చెల్లించిన తిరిగి వారికి డబ్బులు రాకపోగా ఆర్టీసీ తరఫు నుండి ఇలాంటి మడిగేలు కూడా చోటు లేకుండా అయిందని బాధితులు కలెక్టర్ కు విన్నవించుకున్నారు.

పీహెచ్సీ హాస్పిటల్ సందర్శన..

మండల కేంద్రంలో గల పీహెచ్సీ ఆసుపత్రిని తనిఖీ చేసి రోగుల బాగోగులు అడిగి తెలుసుకున్నారు. అంతే కాకుండా డాక్టర్లు సమయపాలన పాటిస్తున్నారా లేదా అని ఆరా తీశారు. ఎప్పటికప్పుడు వైద్యులు 24 గంటలు అందుబాటులో ఉండాలని శాఖ పరంగా తగు చర్యలు తీసుకుంటామని వైద్యులను ఉద్దేశించి కలెక్టర్ అన్నారు.

లొంక తండా బ్రిడ్జి సందర్శన.. త్వరలో నిధులు మంజూరు..

గత నాలుగైదు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా కుంగిపోయి దెబ్బతింది. దెబ్బతిన్న వంతెనను కలెక్టర్ సందర్శించి ఆయా శాఖల అధికారులకు తక్షణమే పనులు ప్రారంభించి తాత్కాలికంగా రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా చూడాలని ఆదేశించడం జరిగింది.

కస్తూర్బాలో భోజనం చేసిన కలెక్టర్..

సందర్శనలో భాగంగా కలెక్టర్ కస్తూర్బా గాంధీలో మధ్యాహ్నం భోజనం విద్యార్థులతో పాటు కలిసి చేశారు. కూరలు బాగున్నాయా అంటూ విద్యార్థులను పలకరించారు. అంతేకాకుండా ప్రతి రోజు మెనూ ప్రకారమే భోజనం అందిస్తున్నారా లేదా అని విద్యార్థులను అడిగారు. అటుపై ప్రిన్సిపాల్ ను వేణు ప్రకారం తప్పనిసరిగా భోజనం అందించాల్సిందేనని గుడ్డు కూడా తప్పనిసరిగా ఇవ్వాల్సిందే అని ఆదేశించారు. మార్కండేయుని గుడి వద్ద ఒక మొక్క నాటి వెళ్లారు. ఈ కార్యక్రమంలో ఆయా శాఖ అధికారులు, స్థానిక ఎస్సై ఆంజనేయులు మండల ప్రజాప్రతినిధులు, తాజా మాజీ సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News