వ్యభిచార గృహాల పై నిఘా పటిష్టం చేస్తాం.. సీఐ నరహరి

నిజామాబాద్ నగర పరిధిలో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా రౌడీ షీటర్లు, అల్లరి మూకలు చట్టానికి లోబడి ప్రవర్తించాలని, చట్టాన్ని మీరి ప్రవర్తించవద్దని నిజామాబాద్ నగర సీఐ నరహరి అన్నారు.

Update: 2024-06-22 14:44 GMT

దిశ, నిజామాబాద్ సిటీ : నిజామాబాద్ నగర పరిధిలో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా రౌడీ షీటర్లు, అల్లరి మూకలు చట్టానికి లోబడి ప్రవర్తించాలని, చట్టాన్ని మీరి ప్రవర్తించవద్దని నిజామాబాద్ నగర సీఐ నరహరి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజామాబాద్ నగర పరిధిలో కల్మేశ్వర్ ఆదేశాల ప్రకారం రాత్రి 10:30 దాటిన తర్వాత ఎలాంటి హోటల్లు, రెస్టారెంట్లు, దుకాణ సముదాయాలు తెరిచి ఉండకూడదని ఆయన స్పష్టం చేశారు.

అదేవిధంగా తమ పరిధిలో ఎలాంటి నేరాలు జరగకుండా అన్ని జాగ్రత్తలు ముందస్తుగా తీసుకుంటున్నట్లు అన్నారు. ముఖ్యంగా ఇటీవల వ్యభిచార ముసుగులో కొందరు తమ స్వార్ధ ప్రయోజనాల కోసం అమాయక పేద మహిళలు, యువతులకు డబ్బులు ప్రలోభ పెట్టి వ్యభిచార కూపంలోకి దించుతున్నారని అలా చేస్తే చట్టరీత్యా నేరమని ఆయన అన్నారు. ఇకపై కూడా వ్యభిచార గృహాల పై తమ నిఘా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.


Similar News