arrested : వెండి ఆభరణాల దొంగతనం కేసులో నిందితుడి అరెస్ట్

మహారాష్ట్రలోని నాందేడ్‌కు చెందిన రాహుల్‌ అనే వెండి వ్యాపారికి చెందిన వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లిన కేసులో నదీం అనే నిందితుడిని సోమవారం నిజామాబాద్ రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు.

Update: 2024-07-29 16:21 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : మహారాష్ట్రలోని నాందేడ్‌కు చెందిన రాహుల్‌ అనే వెండి వ్యాపారికి చెందిన వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లిన కేసులో నదీం అనే నిందితుడిని సోమవారం నిజామాబాద్ రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు వివరాలను నిజామాబాద్ రైల్వే ఎస్ఐ సాయిరెడ్డి మీడియాకు వివరించారు. గత నెల 28 న వ్యాపారి రాహుల్ 14.5 కిలోల వెండి ఆభరణాలను పాలిష్‌ చేయించేందుకు తన వద్ద పనిచేసే సునీల్‌, నదీమ్ అనే వ్యక్తులను హైదరాబాద్‌కు పంపాడు. ప్రయాణంలో సునీల్ నిద్రిస్తుండగా నదీమ్ దుర్బుద్ధితో 14.5 కిలోల వెండి ఆభరణాలను ఎత్తుకుని పారిపోయాడు. నిద్రనుంచి తేరుకున్నాక జరిగింది తెలుసుకున్న సునీల్ తన యజమానికి విషయం చేరవేశాడు. దీంతో ఈ నెల 3న నిజామాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్‌లో రాహుల్ ఫిర్యాదు చేశాడు. ఈ మేర‌కు రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరిపారు.

ఆభరణాలు దొంగిలించిన నిందితుడు నదీం సోమవారం ఉదయం దొంగ‌లించిన వెండి ఆభరణాలు విక్రయించేందుకు నిజామాబాద్ కు వచ్చాడు. అనుమానాస్పదంగా కనిపించిన నదీమ్ ను రైల్వే స్టేషన్ లో డ్యూటీలో ఉన్న రైల్వే కానిస్టేబుళ్లు అడ్డుకుని విచారించారు. నదీం పోలీసుల నుంచి తప్పించుకుని నదీమ్ పారిపోయేందుకు ప్రయత్నించగా రైల్వే పోలీసులు పట్టుకుని తమదైన శైలిలో విచారించారు. నిందితుడు నేరం అంగీకరించడంతో నదీమ్‌ను రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద కేవలం 10 కిలోల వెండి ఆభరణాలు మాత్రమే లభ్యమైనట్లు పోలీసులు పేర్కొన్నారు. మిగిలిన నాలుగున్నర కేజీల వెండి ఆభరణాలను నిందితుడు ఇతర ప్రాంతాల్లో విక్రయించాడని తమ విచారణలో తేలిందని రైల్వే ఎస్ ఐ సాయిరెడ్డి తెలిపారు.


Similar News