BREAKING: ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య
ప్రేమలో ఓడిపోయాననే మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.
దిశ ప్రతినిధి, నిజామాబాద్: ప్రేమలో ఓడిపోయాననే మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం పోచారం గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన దీపక్ (20) అనే యువకుడు ప్రేమలో విఫలం కావడంతో గత కొంతకాలంగా మానసిక కుంగిపోయాడు. శుక్రవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరు లేని సమయంలో దీపక్ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుని తల్లి లత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ ఐ వంశీకృష్ణారెడ్డి తెలిపారు.