చేపల వేటకు వెళ్లి.. యువ జాలరి మృతి
చేపల వేటకు వెళ్లి యువ జాలరి మృతి చెందిన ఘటన కామరెడ్డి జిల్లా నాగిరెడ్డి పేట బొల్లారం గ్రామంలో జరిగింది.
దిశ, నాగిరెడ్డిపేట్:చేపల వేటకు వెళ్లి యువ జాలరి మృతి చెందిన ఘటన కామరెడ్డి జిల్లా నాగిరెడ్డి పేట బొల్లారం గ్రామంలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. బొల్లారం గ్రామానికి చెందిన బెస్త ప్రవీణ్ (25) అనే యువకుడు వృత్తిరీత్యా చేపలు పడుతూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఆదివారం సాయంత్రం గ్రామ సమీపంలోని ఊర చెరువులో చేపలు పట్టడానికి వెళ్లాడు. ఈ క్రమంలో వలలు వేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు తెప్ప పైనుండి జారి పడటంతో కాళ్లకు, చేతులకు వల చుట్టుకుంది. దీంతో ఈత కొట్టడానికి అవకాశం లేక నీటిలో మునిగి మృతి చెందాడు. మృతుడి తల్లి బెస్త దేవవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.