విద్యుత్ ఘాతానికి గురైన విద్యార్థిని.. తృటిలో తప్పిన ప్రమాదం

ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుల నిర్లక్ష్యం కారణంగా ఓ విద్యార్థిని విద్యుదాఘాతానికి గురై తీవ్ర అస్వస్థతకు గురైంది.

Update: 2024-07-09 14:51 GMT

దిశ, నిజామాబాద్ సిటీ : ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుల నిర్లక్ష్యం కారణంగా ఓ విద్యార్థిని విద్యుదాఘాతానికి గురై తీవ్ర అస్వస్థతకు గురైంది. జిల్లా కేంద్రంలోని సారంగాపూర్లో గల పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న సులోచన(11) అనే విద్యార్థిని రోజు మాదిరి ఉదయం పాఠశాలకు వెళ్ళింది. ఈ మేరకు తరగతి గదిలో వేలాడుతున్న విద్యుత్ తీగకు చెయ్యి తగిలి విద్యార్థినీ తీవ్ర అస్వస్థతకు గురైంది. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు హుటాహుటిన నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు. సారంగాపూర్లోని పాఠశాలలో మౌలిక సదుపాయాలు కరువయ్యాయి.

పాఠశాలలో విద్యుత్ తీగలు తెగి వేలాడుతున్న పట్టించుకునే నాథుడే కరువయ్యాడని తల్లిదండ్రులు వాపోతున్నారు. అయితే నిజామాబాద్ జిల్లాలో ప్రతి విద్యా సంవత్సరం ప్రారంభంలోనే ప్రభుత్వ పాఠశాలలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం సర్వసాధారణం అవుతుంది. గత సంవత్సరంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కోట గల్లీలో గల ప్రభుత్వ బాలికల పాఠశాలలో తెగిపోయిన విద్యుత్ వైర్లతో పాఠశాల గోడలకు విద్యుత్ సరఫరా అయి పలువురు విద్యార్థులు విద్యుత్ షాక్ కు గురైన ఘటనలు ఉన్నాయి. అయినప్పటికీ విద్యాశాఖ అధికారులు పట్ల తల్లిదండ్రులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.


Similar News