క్రికెట్ ఆడుతుండగా విద్యార్థికి పాము కాటు..

క్రికెట్ ఆడుతున్న బాలుడు.. పాము కాటుకు గురైన సంఘటన భిక్కనూరు సాంఘిక సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో జరిగింది.

Update: 2024-07-13 11:20 GMT

దిశ, భిక్కనూరు : క్రికెట్ ఆడుతున్న బాలుడు.. పాము కాటుకు గురైన సంఘటన భిక్కనూరు సాంఘిక సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో జరిగింది. వివరాల్లోకి వెళితే కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం దేమె గ్రామానికి చెందిన అక్షిత్ పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్నాడు. శుక్రవారం సాయంత్రం పాఠశాల ఆవరణలో విద్యార్థులతో కలిసి క్రికెట్ ఆడుతున్నాడు.

క్రికెట్ బాల్ తీసుకురావడానికి పిచ్చి మొక్కలతో నిండిపోయిన ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ బాల్ తీసుకుంటుండగా గుర్తుతెలియని పాము కాటేసింది. ఈ విషయాన్ని బాలుడు వెళ్లి సార్లకు చెప్పగా, వారు వెంటనే విషం పైకి ఎక్కకుండా బాలునికి గట్టిగా బట్ట కట్టారు. అదే రాత్రి వెంటనే ఆశ్రమ పాఠశాల స్టాఫ్ కామారెడ్డి జిల్లా కేంద్ర ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ బాలుడు అక్షిత్ చికిత్స పొందుతున్నాడని, ఎలాంటి ప్రమాదం లేదని పాఠశాల స్టాఫ్ శనివారం స్థానిక విలేకరులకు వివరించారు.


Similar News