బీరు సీసాలో కప్ప దర్శనం
కాస్తంత సేద తీరేందుకు చల్లగా బీరు తాగుదామని వైన్ షాపునకు వెళ్లిన ఓ వ్యక్తికి కరెంట్ షాక్ తగిలినంత పనైంది.
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : కాస్తంత సేద తీరేందుకు చల్లగా బీరు తాగుదామని వైన్ షాపునకు వెళ్లిన ఓ వ్యక్తికి కరెంట్ షాక్ తగిలినంత పనైంది. బీరు సీసాలో కప్ప దర్శనమివ్వడంతో సదరు మందు ప్రియుడు ఖంగుతిన్నాడు. ఈ ఘటన డొంకేశ్వర్ మండల కేంద్రంలోని ఓ వైన్ షాపులో చోటు చేసుకుంది.
ఓ వ్యక్తి బీరు కొనుగోలు చేసి తీసుకెళ్దామనుకునే లోపు సీసాలో కప్ప కనిపించడంతో వైన్ షాపు నిర్వాహకుడిని నిలదీశాడు. వారిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బాధితుడు వైన్స్ షాపు నిర్వాహకుడిని హెచ్చరించాడు. ఈ విషయం క్షణాల్లో వైరల్ కాగా మందు ప్రియులు బీరు తాగేందుకు భయపడుతున్నారు. ఇంత నిర్లక్ష్యమా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.