మలేషియాలో చిక్కుకున్న 80 మంది తెలుగు రాష్ర్టాల ప్రజలు.. రంగంలోకి MP ధర్మపురి
మలేషియాలో దాదాపు 80 మంది తెలుగు రాష్ట్రాల ప్రజలు చిక్కుకుపోయారు.
దిశ ప్రతినిధి, నిజామాబాద్: మలేషియాలో దాదాపు 80 మంది తెలుగు రాష్ట్రాల ప్రజలు చిక్కుకుపోయారు. విజిటింగ్ వీసాపై మలేషియాకి వెళ్లగా.. అక్కడి మలేషియా ప్రభుత్వం వీరి వీసాలను రద్దు చేసి అందరిని ఒక చోట ఉంచింది. ఈ విషయం తెలుసుకున్న నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ శుక్రవారం ఉదయం సంబంధిత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రులతో, కౌలాలంపూర్‌లోని ఇండియన్ హై కమిషనర్ బి.ఎన్ రెడ్డితో మాట్లాడారు. దీంతో భారతీయులు ఉన్న చోటుకు అధికారులను పంపారు. మలేషియాలో చిక్కుకుపోయిన 80 మందిలో నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్‌కు చెందిన 30-40 మంది ఉన్నట్లు సమాచారం. వీరందరూ వీలైనంత త్వరగా భారత్‌కి తిరిగి వస్తారని ఎంపీ అరవింద్ తెలిపారు. బాల్కోండకు చెందిన మల్లేష్ అనే యువకుడితో అరవింద్ మాట్లాడి మలేషియాలో చిక్కుకున్న తెలుగు వారిని రప్పిస్తామని భరోసా కల్పించారు.