జాలర్ల వలకుపడ్డ 21 కిలోల చేప

కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ ప్రాజెక్టులో శుక్రవారం ఓ మత్స్యకారుడికి 21 కిలోల బొచ్చ చేప లభ్యమైంది.

Update: 2024-02-16 14:39 GMT

దిశ,నిజాంసాగర్ : కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ ప్రాజెక్టులో శుక్రవారం ఓ మత్స్యకారుడికి 21 కిలోల బొచ్చ చేప లభ్యమైంది. నిజాంసాగర్ ప్రాజెక్టు సమీపంలోని హసన్ పల్లి గ్రామానికి చెందిన గుల్ల లక్ష్మణ్ అనే మత్స్యకారుడు శుక్రవారం నిజాంసాగర్ ప్రాజెక్టు లోకి చేపల వేటకు వెళ్లాడు. తాను వేసిన వలలతో చేపల వేట కొనసాగిస్తుండగా వలలో 21 కిలోల బొచ్చ రకం చేప పడింది. 21 కిలోల బొచ్చ చేప లభ్యం కావడంతో లక్ష్మణ్ ఆనందంతో ఇంటికి బయలుదేరాడు. ఇంత పెద్ద చాప పడడంతో ఆనందంతో మురిసిపోయాడు. అనంతరం ఆ చేపను నిజాంసాగర్ మార్కెట్లో విక్రయానికి పెట్టడంతో చేపల ప్రియులు ఆ చేపను కొనుగోలు చేసేందుకు భారీగా పోటీ పడ్డారు.  


Similar News