ఘనంగా 102వ అంతర్జాతీయ వ్యవసాయ సహకార సంఘ దినోత్సవం వేడుకలు...

ఆలూరు మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో శనివారం రోజు చైర్మన్ తంబురు శ్రీనివాస్ ఆధ్వర్యంలో 102వ అంతర్జాతీయ వ్యవసాయ సహకార సంఘ దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ చేశారు.

Update: 2024-07-06 09:31 GMT

దిశ, ఆలూర్ : ఆలూరు మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో శనివారం రోజు చైర్మన్ తంబురు శ్రీనివాస్ ఆధ్వర్యంలో 102వ అంతర్జాతీయ వ్యవసాయ సహకార సంఘ దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా తంబురు శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జూలై నెల మొదటి శనివారం రోజు సహకార సంఘాల ఉద్యమం ఆశయాలు, లక్ష్యాల గురించి ప్రజలలో చైతన్యం కలిగించడం కోసం ఈ దినోత్సవం జరుపుకుంటామని, అదేవిధంగా సహకార సంఘాల ఏర్పాటుతో రైతులకు రుణ సౌకర్యం అందుబాటులోకి వచ్చిందన్నారు. గ్రామ, మండల స్థాయిలో సంఘాల ఏర్పాటుతో వాటి పరిధిలోని బ్యాంకుల ద్వారా రుణాలు అందుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ,వైస్ చైర్మన్ చేపూర్ రాజేశ్వర్, సొసైటీ డైరెక్టర్స్ కళ్లెం సాయి రెడ్డి,బార్ల సంతోష్ రెడ్డి, సింగేడి మల్లుబాయ్, ఏఈఓ వసుధము, సొసైటీ కార్యదర్శి తొర్తి మల్లేష్, గంగాధర్ , ముత్యం, దేవరాజ్,రాజు, సొసైటీ సిబ్బంది, గ్రామ రైతులు పాల్గొన్నారు.


Similar News