సారంగపూర్‌లో చిరుతపులి కలకలం.. మేకల కాపరిని వెంటాడటంతో చెట్టెక్కి కేకలు

అడవుల నుంచి జనావాసాల్లోకి వస్తున్న వన్య మృగాలు పశువులు, మనుషులపై దాడులు చేస్తున్న సంఘటనలు ఇటీవల కాలంలో భారీగా పెరిగిపోతున్నాయి.

Update: 2024-10-25 05:34 GMT

దిశ, వెబ్ డెస్క్: అడవుల నుంచి జనావాసాల్లోకి వస్తున్న వన్య మృగాలు పశువులు, మనుషులపై దాడులు చేస్తున్న సంఘటనలు ఇటీవల కాలంలో భారీగా పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో తాజాగా నిర్మల్(nirmal) జిల్లాలో శుక్రవారం ఉదయం మరోసారి చిరుత(Leopard) సంచారం కలకలం గా మారింది. వివరాల్లోకి వెళితే.. నిర్మల్ జిల్లాలోని సారంగాపూర్ మండలం రవీంద్ర నగర్ లో సంచరించిన చిరుత పులి సహ్యాద్రి కొండల వద్ద మేకల కాపరి ని వెంబడించింది. దీంతో ఆందోళనకు గురైన మేకల కాపరి.. చెట్టు పైకి ఎక్కి కేకలు వేశాడు. దీంతో చిరుత పులి కింద ఉన్న మేకలను తినడం ప్రారంభించింది. చెట్టుపై ఉండి కేకలు వేయడంతో ఇరుగుపొరుగు వారు వచ్చాయి. అప్పటికి రెండు మేకలను తిన్న పులి.. గ్రామస్తులను చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కాగా పులి సంచారంతో స్థానిక ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.


Similar News