MLA Venkataramana Reddy : పాఠశాలకు చేయూతనివ్వడం అభినందనీయం..

తన స్వగ్రామంలోని ప్రభుత్వ పాఠశాలకు చేయూతనిచ్చేందుకు గాను లక్ష రూపాయలు విరాళంగా ఇవ్వడం అభినందనీయమని గ్రామానికి చెందిన మీసాల వినయ్ రెడ్డిని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణా రెడ్డి అభినందించారు.

Update: 2024-07-18 15:07 GMT

దిశ, కామారెడ్డి : తన స్వగ్రామంలోని ప్రభుత్వ పాఠశాలకు చేయూతనిచ్చేందుకు గాను లక్ష రూపాయలు విరాళంగా ఇవ్వడం అభినందనీయమని గ్రామానికి చెందిన మీసాల వినయ్ రెడ్డిని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణా రెడ్డి అభినందించారు. కామారెడ్డి మండలం చిన్న మల్లారెడ్డి బాలుర ఉన్నత పాఠశాలకు గ్రామానికి చెందిన మీసాల వినయ్ రెడ్డి లక్ష రూపాయల విరాళం అందించారు. ఈ డబ్బులతో పాఠశాలకి లైబ్రరీ పుస్తకాలు మూడు భాషల్లో (ఆంగ్లము, తెలుగు, హిందీ), గణితం, భౌతిక శాస్త్రానికి సంబంధించిన ప్రయోగశాల పరికరాలు, జీవశాస్త్రానికి మైక్రోస్కోప్ ఇన్ స్లైడ్స్ అలా మెటీరియల్ తీసుకువచ్చారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి ఫలితాలు ఉన్నతంగా రావడానికి ఉపాధ్యాయుల కృషిని అభినందిస్తూ పాఠశాలల్లో మౌళిక వసతుల సాధనకు ఇలాంటి దాతలు ముందుకు రావాలని కోరారు. ఈ సందర్భంగా మీసాల వినయ్ కుమార్ రెడ్డి, తన తండ్రి మీసాల చంద్రా రెడ్డిని ఈ సందర్భంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వెంకట రమణారెడ్డి హాజరై విద్యార్థులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి ఎల్లయ్య, ఉపాధ్యాయులు, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ అధ్యక్షురాలు శ్రీలత, పూర్వవిద్యార్థుల సంఘం అధ్యక్షులు బాలయ్య తదితరులు పాల్గొన్నారు.


Similar News