ఎల్లారెడ్డిలో రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం ప్రారంభం

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన అనంతరం ఆరు గ్యారెంటీలో భాగంగా రెండు గ్యారెంటీలను రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశానుసారం ఎల్లారెడ్డి నియోజకవర్గంలో శాసనసభ్యులు మదన్మోహన్ ఆధ్వర్యంలో, ఎల్లారెడ్డి తహశీల్ కార్యాలయంలో డిప్యూటీ డీఎంహెచ్ వో శోభారాణి ఆర్డీవో మన్నే ప్రభాకర్, ఆరోగ్యశ్రీ పథకం ప్రారంభించారు.

Update: 2023-12-10 11:28 GMT

దిశ, ఎల్లారెడ్డి : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన అనంతరం ఆరు గ్యారెంటీలో భాగంగా రెండు గ్యారెంటీలను రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశానుసారం ఎల్లారెడ్డి నియోజకవర్గంలో శాసనసభ్యులు మదన్మోహన్ ఆధ్వర్యంలో, ఎల్లారెడ్డి తహశీల్ కార్యాలయంలో డిప్యూటీ డీఎంహెచ్ వో శోభారాణి ఆర్డీవో మన్నే ప్రభాకర్, ఆరోగ్యశ్రీ పథకం ప్రారంభించారు. ఆరోగ్య శ్రీ పథకంలో 1672 రోగాలకు సంబంధించిన వాటికి ఈ పథకం వర్తింపజేస్తుందని డిప్యూటీ డీఎంహెచ్వో వైద్యులు శోభారాణి తెలిపారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోగ్య శ్రీ పథకం ద్వారా రెండు లక్షల రూపాయలు ఉండేది బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 5 లక్షల రూపాయలు నేడు కాంగ్రెస్ ప్రభుత్వం అయామ్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 10 లక్షల రూపాయల ఆరోగ్య శ్రీ పథకమును ప్రారంభించారని, తెల్లరేషన్ కార్డు ఉన్న వారు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా లబ్ధి పొందవచ్చునని డిప్యూటీ డీఎంహెచ్ వో వైద్యులు శోభారాణి తెలిపారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు లింగంపేట జెడ్పీటీసీ శ్రీలత సంతోష్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని, నేడు ప్రవేశపెట్టిన ఆరోగ్య శ్రీ పథకం ద్వారా ఎంతో మంది పేద ప్రజలకు లబ్ధి చేకూరుతుందని అన్నారు. అలాగే ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం తలపెట్టిన గొప్ప సంకల్పమని తెలిపారు. ఇచ్చిన మాటను తప్పేది లేదు కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పదని ఆరు గ్యారెంటీ పథకాలు నువ్వు భాగంగా రెండు గ్యారెంటీ పథకాలు రాష్ట్రవ్యాప్తంగా నేడు మొదలయ్యాయని త్వరలో మిగిలిన పథకాలు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రవేశపెడతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి మాజీ జెడ్పీటీసీ గయాజుద్దీన్, నాగిరెడ్డిపేట ఎంపీపీ రాజదాస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, విద్యాసాగర్ మాజీ జెడ్పీటీసీ సామెల్ మాజీ ఎల్లారెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకటరెడ్డి తిమ్మారెడ్డి మాజీ సర్పంచ్ వెంకటరెడ్డి, చిన్న లక్ష్మణ్ లింగంపేట్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజు, ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసులు మత్తమాల ఆరోగ్య వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News