హైదరాబాద్లో NIA సోదాల కలకలం
హైదరాబాద్ లో ఎన్ఐఏ సోదాలు తీవ్ర కలకలం రేపాయి.
దిశ, వెబ్డెస్క్: హైదరాబాద్లో ఎన్ఐఏ సోదాలు తీవ్ర కలకలం రేపాయి. సీనియర్ జర్నలిస్ట్, వీక్షణం ఎడిటర్ ఎన్. వేణుగోపాల్ ఇంట్లో ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తోంది. హిమాయత్ నగర్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు చేపట్టారు. ఎన్. వేణుగోపాల్ వరవరరావు అల్లుడు కాగా మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలతో ఎన్ఐఏ అధికారులు సోదాలు చేపట్టారు. ఎల్బీనగర్లో పౌరహక్కుల నేత రవి శర్మ ఇంట్లో సైతం తనిఖీలు కొనసాగుతున్నాయి. ఎన్ఐఏ సోదాలకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.