వచ్చే నెలలో BJP రెండు భారీ బహిరంగసభలు.. గెస్ట్‌లు వీరే!
బీజేపీ తెలంగాణ కార్యవర్గ సమావేశాలు సోమవారం చంపాపేటలో ప్రారంభమయ్యాయి.
దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ తెలంగాణ కార్యవర్గ సమావేశాలు సోమవారం చంపాపేటలో ప్రారంభమయ్యాయి. పార్టీ జెండాను బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ఆవిష్కరించారు. మోడీ 9 ఏళ్ల పాలనా విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై ఈ కార్యక్రమంలో చర్చించారు. మే 30 నుంచి జూన్ 30 వరకు మహాజన్ సంపర్క్ అభియాన్ కార్యక్రమాలను చేపట్టనున్నారు. వచ్చే నెలలో తెలంగాణలో రెండు భారీ బహిరంగ సభలను నిర్వహించనున్నట్లు బండి సంజయ్ తెలిపారు. ఒక సభకు అమిత్ షా, మరో సభకు నడ్డా వస్తారని బండి తెలిపారు.
Read More: కాంగ్రెస్ అభ్యర్థులను నిర్ణయించేది కేసీఆరే.. బండి సెన్సేషనల్ కామెంట్స్