దిశ తెలంగాణ క్రైం బ్యూరో: చోరీ అయిన, పోగొట్టుకున్న మొబైల్ఫోన్ల జాడను తెలుసుకునేందుకు సెంట్రల్ఎక్విప్ మెంట్ ఐడెంటిటీ రిజిష్టర్(సీఈఐఆర్) విధానాన్ని అమల్లోకి తీసుకు వస్తున్నట్టు డీజీపీ అంజనీకుమార్చెప్పారు. ఈ విధానం పని తీరుపై అన్ని జిల్లాల ఎస్పీలు, కమిషనరేట్ల కమిషనర్లకు మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ద్వారా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డీజీపీ అంజనీకుమార్మాట్లాడుతూ ప్రజలు అత్యధికంగా ఉపయోగించే ఎలక్ర్టానిక్గ్యాడ్జెట్సెల్ఫోన్అని చెప్పారు. ఈ క్రమంలో సెల్ఫోన్చోరీలు ఏయేటికాయేడు గణనీయంగా పెరిగిపోతున్నాయన్నారు. ఇక, మొబైల్ఫోన్లను పోగొట్టుకుంటున్న వారి ఫిర్యాదులు కూడా పెరుగుతూ వస్తున్నట్టు చెప్పారు. ఈ నేపథ్యంలోనే చోరీ అయిన, కనిపించకుండా పోయిన సెల్ఫోన్లను కనుగొని స్వాధీనం చేసుకునేందుకే సీఈఐఆర్విధానాన్ని అమల్లోకి తెస్తున్నట్టు తెలిపారు.
దీనిపై పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఉంటున్న సామాన్య ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. మే 17న ప్రపంచ టెలికాం దినోత్సవం ఉన్న నేపథ్యంలో ఆ రోజు నుంచి ఈ విధానాన్ని అమల్లోకి తేనున్నట్టు చెప్పారు. అదనపు డీజీపీ మహేశ్భగవత్మాట్లాడుతూ రాష్ట్రంలోని 750 పోలీస్ స్టేషన్లలో పనిచేస్తున్న పోలీసు అధికారులకు ఈ విధానంపై శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. సెల్ఫోన్వాడే ప్రతి ఒక్కరికి సీఈఐఆర్ గురించి తెలిసేలా బ్లూకోల్ట్స్ పోలీసులు ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. సెల్ఫోన్పోయిందనో… చోరీ అయ్యిందనో ఎవరైనా స్టేషన్‌కు వస్తే రిసెప్షన్లో ఉండే సిబ్బంది సీఈఐఆర్యాప్లో పూర్తి వివరాలు నమోదు చేయాలని సూచించారు. అలా చేస్తే మొబైల్ఫోన్లు దొరికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు. కేంద్ర టెలికాం మంత్రిత్వ శాఖ ఈ యాప్‌ను అందుబాటులోకి తెచ్చిందని చెబుతూ దీనికోసం డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు.సీఈఐఆర్.జీవోవీ.ఇన్అన్న వెబ్‌సైట్‌కి లాగిన్కావాల్సి ఉంటుందన్నారు.
దీంట్లోకి వెళ్లిన తర్వాత ఐఏంఈఐ నంబర్, కంపెనీ పేర, మోడల్, కొన్న బిల్లును అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నారు. ఫోన్ఎక్కడ పోయింది? ఏ స్టేషన్లో ఫిర్యాదు చేశారన్న వివరాలను నమోదు చేయాలని చెప్పారు. చివరగా వినియోగదారుని పేరు, చిరునామా, గుర్తింపు కార్డు, ఈ మెయిల్ఐడీ, ఓటీపీ కోసం మరో మొబైల్‌నెంబర్‌ను అప్‌లోడ్‌చేయాలని సూచించారు. దీనివల్ల పోగొట్టుకున్న, చోరీ అయిన మొబైల్ ఫోన్లు తిరిగి స్వాధీనం చేసుకునే అవకాశాలు మెరుగవుతాయని వివరించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో టెలికాం శాఖ డిప్యూటీ డైరెక్టర్జనరల్రాజశేఖర్, డైరెక్టర్లు మురళీకృష్ణ, రాఘవరెడ్డి, అదనపు డీజీలు అనిల్‌కుమార్, షికాగోయల్, సంజయ్‌కుమార్‌జైన్, శివధర్‌రెడ్డి, అభిలాష్‌బిస్త్, ఐజీలు కమలాసన్‌రెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, షానవాజ్‌ఖాసీం, డీఐజీ రమేష్‌రెడ్డి, ఎస్పీలు లావణ్య, విజయ్కుమార్పాల్గొన్నారు.