తెలంగాణ భవన్‌లో కొత్త రూల్స్.. షాకైన మంత్రులు, ఎమ్మెల్యేలు!

అధికార టీఆర్ఎస్ పార్టీ నేతలకు మొబైల్ ఫోన్లతో టెన్షన్ మొదలైంది. ఒకవైపు ఫోన్ ట్యాపింగ్ అంటూ విపక్షాల నుంచి విమర్శలు వస్తున్న నేపథ్యంలో సొంత పార్టీ

Update: 2022-11-15 11:17 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: అధికార టీఆర్ఎస్ పార్టీ నేతలకు మొబైల్ ఫోన్లతో టెన్షన్ మొదలైంది. ఒకవైపు ఫోన్ ట్యాపింగ్ అంటూ విపక్షాల నుంచి విమర్శలు వస్తున్న నేపథ్యంలో సొంత పార్టీ వివరాలు బయటకు లీక్ కాకుండా స్వీయ జాగ్రత్తలు మొదలయ్యాయి. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్‌లో జరిగే ఎల్పీ సమావేశంలో కొత్త నిబంధన తీసుకొచ్చారు. ఫోన్‌లు లేకుండా సమావేశానికి రావాలని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలకు ఆదేశాలు జారీ చేశారు. గతంలో ఎన్నడూ లేని ఈ ఆంక్షలు ఈసారి అమలవుతున్నాయి. దీంతో ప్రజా ప్రతినిధులంతా వారి మొబైల్ ఫోన్లను వారి వారి కార్లలోనే వదిలి సమావేశానికి హాజరయ్యారు. మొయినాబాద్ ఫాంహౌజ్ ఎపిసోడ్‌ తర్వాతి పరిణామాలు పార్టీలో హాట్ టాపిక్‌గా మారింది.


Similar News