New Ration Cards: ముగిసిన కేబినెట్ భేటీ.. తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్
కొత్త రేషన్ కార్డులపై(New Ration Cards) రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) శుభవార్త చెప్పింది.
దిశ, వెబ్ డెస్క్: కొత్త రేషన్ కార్డులపై(New Ration Cards) రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) శుభవార్త చెప్పింది. సంక్రాంతి(Sankranthi) నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలని నిర్ణయించింది. శనివారం తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినేట్ భేటీ(Cabinet Meeting) జరిగింది. మూడున్నర గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దాదాపు 22 అంశాలపై కేబినెట్ భేటీలో సంతకాలు జరిగాయి. ఈ నేపథ్యంలోనే కొత్త రేషన్ కార్డుల జారీపై కూడా కీలక నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే ప్రజల నుంచి నూతన రేషన్ కార్డుల జారీ ప్రక్రియకు సంబంధించి అప్లికేషన్లు తీసుకొని, సంక్రాంతి పండుగ సందర్భంగా తెలంగాణ ప్రజలకు కొత్త రేషన్ కార్డులను జారీ చేయాలని కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్నారు.