Rachakonda : ట్రాఫిక్ సిబ్బందికి కొత్త టోపీలు! సిబ్బంది శ్రేయస్సుకు ప్రాధాన్యత: సీపీ సుధీర్ బాబు

క్షేత్ర స్థాయి సిబ్బంది శ్రేయస్సుకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తామని రాచకొండ సీపీ సుధీర్ బాబు అన్నారు.

Update: 2024-09-09 10:12 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: క్షేత్ర స్థాయి సిబ్బంది శ్రేయస్సుకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తామని రాచకొండ సీపీ సుధీర్ బాబు అన్నారు. రాచకొండ పరిధిలో పోలీసు సిబ్బంది సంక్షేమ చర్యలలో భాగంగా ట్రాఫిక్ వింగ్‌ సిబ్బందికి (500) తెల్లటి టోపీలను ఇవాళ రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. రాచకొండ పరిధిలో ట్రాఫిక్ నియంత్రణ కోసం అహర్నిశలు కృషి చేస్తున్న సిబ్బందికి ఈ టోపీలు ఒక చిరు ప్రశంస అని, వారికి విధి నిర్వహణ మరింత సులభతరం అవుతోందని తెలిపారు.

ట్రాఫిక్ విభాగ సిబ్బంది రోజువారీ విధుల్లో పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్న కమిషనర్ తక్షణమే స్పందించి ఎండలు, వర్షం నుంచి సిబ్బందికి మరింత సౌకర్యాన్ని, రక్షణను అందించే ఉద్దేశంతో కొత్తగా రూపొందించిన టోపీలను ట్రాఫిక్ సిబ్బంది అందరికీ అందించనున్నారు. గతంలో ట్రాఫిక్ సిబ్బందికి ఇచ్చిన వైట్ హెల్మెట్ బరువు సుమారు 365 గ్రాములు కాగా కొత్త ట్రాఫిక్ టోపీల బరువు 165 గ్రాములు మాత్రమే.. దీంతో 200 గ్రాములు తేలికగా ఉండటంతో రోజువారీ విధుల నిర్వహణలో ఈ టోపీలు సులభంగా ఉపయోగించడం మరింత సౌకర్యవంతంగా ఉంటాయని అధికారులు చెబుతున్నారు. 


Similar News