Bhatti Vikramarka : త్వరలో కొత్త విద్యుత్ పాలసీ : భట్టి విక్రమార్క

తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) మరో ముందడుగు వేయనుంది.

Update: 2024-11-03 15:15 GMT

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) మరో ముందడుగు వేయనుంది. రాష్ట్రంలో త్వరలోనే కొత్త విద్యుత్ పాలసీ(New Electricity Policy)ని ప్రవేశ పెట్టనున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) పేర్కొన్నారు. మరో కొద్ది రోజుల్లో విద్యుత్ నిపుణులు, ప్రజల అభిప్రాయాలను తెలుసుకొని నూతన పాలసీని ప్రకటిస్తామని ఆయన పేర్కొన్నారు. నేడు యాదాద్రి థర్మల్ పవర్ ను మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా.. ప్రస్తుతం రాష్ట్రంలో అవసరానికి సరిపడా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నామని పేర్కొన్నారు. వచ్చే మే నెల నాటికి 4 వేల మెగావాట్ల విద్యుత్ ను గ్రిడ్ కు కలుపుతామని తెలియ జేశారు. 2034-35 నాటికి రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ 31 వేల మెగవాట్లకు చేరుకుంటుందని, దానిని చేరుకునే విధంగా గ్రీన్ ఎనర్జీని ప్రవేశ పెడతామని భట్టి వెల్లడించారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలో నూతన విద్యుత్ పాలసీని తీసుకు వచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని స్పష్టం చేశారు.

Tags:    

Similar News