'వెల్ కమ్ టు క్షుద్ర విద్య' కేసీఆర్ సోేషల్ మీడియా ఎంట్రీపై నెటిజన్ల సెటైర్లు

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ తొలిసారి సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

Update: 2024-04-28 09:16 GMT

దిశ, డైనమిక్ బ్యూరో:బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ తొలిసారి సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చారు. @KCRBRSpresident పేరుతో కేసీఆర్ తన ఎక్స్(ట్విట్టర్)తో పాటు ఇన్ స్టాగ్రామ్ ఖాతాను తెరిచారు. అకౌంట్ ఓపెన్ చేసిన గంటల వ్యవధిలోనే కేసీఆర్ కు భారీగా ఫాలోవర్స్ వచ్చారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సామాజిక మాధ్యమాల్లో అడుగుపెట్టిన కేసీఆర్ ఆ వెంటనే రాష్ట్రంలోని విద్యుత్ సమస్యపై ట్విట్టర్ వేదికగా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలోకి అడుగుపెట్టిన కేసీఆర్ ను కొంత మంది నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. గతంలో సీఎంగా ఉండగా సోషల్ మీడియాపై ఆయన చేసిన విమర్శలకు సంబంధించిన వీడియోలను షేర్ చేస్తూ సెటైర్లు వేస్తున్నారు. సోషల్ మీడియాను ఉద్దేశించి గతంలో కేసీఆర్ మాట్లాడుతూ..'లంగ సోషల్ మీడియాలో అన్ని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. అది సోషల్ మీడియా కాదు ఓ క్షుద్ర విద్య' అని వ్యాఖ్యానించారు. ఇందుకు సంబంధించిన వీడియోను షేర్ చేస్తూ వెల్ కమ్ టు క్షుద్ర విద్య అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

కేటీఆర్, సంతోష్ ను అన్ ఫాలో చేసిన కేసీఆర్:

కాగా, సోషల్ మీడియా ఖాతా తెరిచిన కేసీఆర్ ట్విట్టర్ లో నిన్న ముగ్గురి ఖాతాలను ఫాలో కాగా నేడు వాటిని అన్ ఫాలో చేసి ఇప్పుడు ఒకే ఖాతాను ఫాలో చేస్తున్నారు. నిన్న ట్విట్టర్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సంతోష్, హిమాన్షు ట్విట్టర్ ఖాతాలను కేసీఆర్ ఫాలో అయ్యారు. ఆ తర్వాత వారిని అన్ ఫాలో చేసి ప్రస్తుతం కేవలం బీఆర్ఎస్ పార్టీ అధికారిక ఖాతాను మాత్రమే ఫాలో అవుతున్నారు. ప్రస్తుతం ట్విట్టర్ లో కేసీఆర్ కు 26.6కే ఫాలోవర్స్ ఉన్నారు.

Read More..

 Hyderabad Metro Rail: మెట్రో ప్రయాణికులకు బంపర్ న్యూస్.. త్వరలో అందుబాటులోకి 13 మెట్రో స్టేషన్లు 

Tags:    

Similar News

టైగర్స్ @ 42..