నీట్ తదితర పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తాం: రాష్ట్రపతి
18 వ లోక్‌సభ కొలువుదీరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ప్రసంగించారు.
దిశ, వెబ్‌డెస్క్: 18 వ లోక్‌సభ కొలువుదీరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ప్రసంగించారు. 24, 25 తేదీల్లో లోక్ సభ ఎన్నికల్లో విజయం సాధించిన సభ్యులు ఎంపీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక 18 లోక్ సభ 24 వ తారీకున ప్రారంభం కాగా.. ఇవాళ నుంచి రాజ్యసబ సమావేశాలు స్టార్ట్ అయ్యాయి. కాగా నేడు పార్లమెంట్ సమావేశంలో ద్రౌపతి ముర్ము మాట్లాడుతూ.. పరీక్షల నిర్వహణలో అక్రమాలకు పాల్పడేవారిపై తప్పకుండా కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. జులై 1 నుంచి అమల్లోకి కొత్త నేర చట్టాలు తీసుకొస్తున్నామని తెలిపారు. నీట్ పేపర్ లీకేజీ నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. నీట్ తదితర పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తామని వెల్లడించారు. పరీక్షల నిర్వహణలో పారదర్శకతకు ప్రాధాన్యమివ్వాలన్నారు. అలాగే పౌర విమానరంగంలో ఎన్నో మార్పులు తెచ్చామన్నామని తెలిపారు. ప్రపంచంలోనే 5 వ బలమైన ఆర్థిక శక్తిగా ఇండియా డెవలప్ అయ్యిందని చెప్పారు. సర్వీస్ సెక్టార్లను సర్కారు బలపరుస్తోందని చెప్పుకొచ్చారు. ఆర్గానిక్ ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతోందని అన్నారు. ఐటీ టూరిజం వరకు అన్ని రంగాల్లో మన దేశం దూసుకుపోతుందని తెలిపారు. మా ప్రభుత్వం పదేళ్లుగా దేశాభివృద్ధి కృషి చేస్తోందని వెల్లడించారు. ప్రపంచ వృద్ధిలో ఇండియా 15 శాతం భాగస్వామ్యం అవుతుందని పేర్కొన్నారు.