సీసీఎల్ఏ వెబ్‌సైట్‌లో ముసాయిదా

ప్రభుత్వం ధరణి సమస్యల పరిష్కారానికి కొత్త ఆర్వోఆర్ బిల్లు 2024 పై ప్రజాభిప్రాయ సేకరణకు శ్రీకారం చుట్టింది.

Update: 2024-08-02 12:14 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వం ధరణి సమస్యల పరిష్కారానికి కొత్త ఆర్వోఆర్ బిల్లు 2024 పై ప్రజాభిప్రాయ సేకరణకు శ్రీకారం చుట్టింది. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి అసెంబ్లీలో ప్రకటించినట్లుగానే ముసాయిదా బిల్లును పబ్లిక్ డొమెయిన్‌లో పెడుతున్నట్లు సీసీఎల్ఏ నవీన్ మిట్టల్ ప్రకటించారు. ప్రజల నుంచి సూచనలు, సలహాలు స్వీకరించేందుకు సీసీఎల్ఏ వెబ్ సైట్ (www.ccla.telangana.gov.in)లో అందుబాటులో ఉంచుతున్నారు. ఈ నెల 23వ తేదీ వరకు ఈ ముసాయిదా బిల్లుపై ఎవరైనా తమ అభిప్రాయాలను ప్రభుత్వానికి తెలియజేసేందుకు వీలు కల్పించారు. ప్రజలు తమ సలహాలు సూచనలను ఈ మెయిల్ (ror2024-rev@telangana.gov.in) చేయాలి. పోస్ట్ ద్వారా సీసీఎల్ఏ కార్యాలయానికి పంపించవచ్చు. చిరునామా; ల్యాండ్ లీగల్ సెల్, సీసీఎల్ఏ కార్యాలయం, నాంపల్లి, స్టేషన్ రోడ్, అన్నపూర్ణ హోటల్ ఎదురుగా, ఆబిడ్స్, హైదరాబాద్ 500001.

Tags:    

Similar News