‘నేషనల్ డిజాస్టర్ అలయెన్స్’.. NDAకు కేటీఆర్ కొత్త ఫుల్‌ఫామ్

నేషనల్ డెమొక్రటిక్ అలయెన్స్ ఎన్డీయేకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొత్త ఫుల్‌ఫామ్ చెప్పారు.

Update: 2024-06-24 11:32 GMT

దిశ, వెబ్‌డెస్క్: నేషనల్ డెమొక్రటిక్ అలయెన్స్ ఎన్డీయేకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొత్త ఫుల్‌ఫామ్ చెప్పారు. ట్విట్టర్ వేదికగా నీట్ యూజీ పేపర్ లీకేజీ, ఇతర పరీక్షల వాయిదాలపై ఆయన స్పందించారు. విద్యార్థుల అకడమిక్ కెరీర్‌ను చిన్నాభిన్నం చేయడం నిజంగా దురదృష్టకరమన్నారు. జూన్ 4న నీట్ యూజీ పేపర్ లీక్ అయిందని, జూన్ 19న యూజీసీ నెట్ క్యాన్సిల్ అయిందని గుర్తు చేశారు. జూన్ 21న సీఎస్ఐఆర్ యూజీసీ నెట్ వాయిదా పడిందన్నారు. జూన్ 22న నీట్ పీజీటీ చివరి నిమిషంలో వాయిదా పడిందన్నారు.

బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కారు నిర్ణయాలకు ఓ కారణం, పద్ధతి లేదన్నారు. నీట్ యూజీ ప్రశ్నాపత్రం ముందుగానే లీక్ అయినట్లు రుజువులు ఉన్నా.. మోడీ ప్రభుత్వం జూలై 6న కౌన్సిలింగ్ కొనసాగిస్తుందని కేటీఆర్ మండిపడ్డారు. నిర్ధిష్ట కారణాలు చెప్పకుండా నీట్ పీజీ పరీక్ష ప్రారంభానికి కొన్ని గంటల ముందు వాయిదా వేయడంతో విద్యార్థులు నిరాశకు గురయ్యారన్నారు. ఇందులో ఉన్న లాజిక్ ఏంటి అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ అసమర్థత విద్యార్థుల పాలిట శాపంగా మారిందన్నారు. ‘ఎన్డీయే డిజాస్టర్ అలయెన్స్’ దీనికి కారణం అంటూ సెటైర్లు వేశారు.         


Similar News