Nampally: ఆసుపత్రిలో రోగుల కంటే బోనాలకే ప్రాముఖ్యత..! నెటిజన్లు ఫైర్

క్యూలో ఉన్న రోగులను పట్టించుకోకుండా అంగరంగవైభవంగా బోనాలు వేడుకలు జరుపుకుంటున్న ఘటన నాంపల్లి ప్రభుత్వాసుపత్రిలో చోటుచేసుకుంది.

Update: 2024-07-23 10:38 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: క్యూలో ఉన్న రోగులను పట్టించుకోకుండా అంగరంగవైభవంగా బోనాలు వేడుకలు జరుపుకుంటున్న ఘటన నాంపల్లి ప్రభుత్వాసుపత్రిలో చోటుచేసుకుంది. దీనికి సంబందించిన వీడియో వైరల్ గా మారడంతో ఆసుపత్రి సిబ్బందిపై నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. ఈ ఘటన ప్రకారం నాంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో 100 మందికి పైగా రోగులు క్యూ కట్టి డాక్టర్ల కోసం వేచి చూస్తున్నారు. కానీ ఆసుపత్రి సిబ్బంది మాత్రం బోనాల పండుగ వేడుకల్లో బిజీగా ఉన్నారు. ఈ వీడియోలో హస్పిటల్ లోని మహిళలు బోనాలు ఎత్తుకొని రాగా.. డప్పు వాయిద్యాలు మోగిస్తూ.. డ్యాన్సులతో ఆసుపత్రి ప్రాంగణంలో ఊరేగింపు చేశారు. అంతేగాక అదే డప్పు చప్పుళ్లతో హస్పిటల్ లో కూడా తిరిగారు. దీనికి సంబందించిన వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

దీంతో నాంపల్లి ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బందిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. రోగులు క్యూలో నిలబడి ఉండగా.. వారు వేడుకలు చేసుకోవడం ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. వేడుకలు నిర్వహించుకోవడంలో తప్పు లేదు కానీ రోగులకు ఇబ్బంది కలిగేలా ఆసుపత్రిలో డప్పు చప్పుళ్లు ఏంటని మండిపడుతున్నారు. రోగుల కంటే వారికి బోనాల వేడుకలకే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఓ నెటిజన్ స్పందిస్తూ.. వీడియోలో వందల మంది బయట నిలబడి ఉండడం చూస్తున్నామని, కనీసం ప్రభుత్వ ఆసుపత్రిలో సీటింగ్ సౌకర్యం లేదా ?? అంటూ.. రోగులకు అసౌకర్యం కలిగించే శబ్దాలు చేయడం గురించి ఆరోగ్య అధికారులకు తెలియదా? అని, లోపల ఉన్న రోగులపై నిఘా ఉంచేది ఎవరని ప్రశ్నించగా.. మరో నెటిజన్ అది ఆసుపత్రి అని తెలియదా.. వేడుకలు జరుపుకోవడం తప్పు కాదు కానీ పేషంట్లకు ఇబ్బంది కలిగేలా శబ్దాలు చేయడమే సమస్య అని కామెంట్లు పెడుతున్నారు.

Tags:    

Similar News