టీ-బీజేపీ మేనిఫెస్టోకు పేరు ఫిక్స్.. కాంగ్రెస్‌కు దీటుగా కాషాయ పార్టీ ప్లాన్..!
వచ్చే ఎన్నికలకు మేనిఫెస్టో సిద్ధం చేయడంపై బీజేపీ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే వరుస సమావేశాలతో మేనిఫెస్టో కమిటీ బిజీగా ఉంది. కాగా కాషాయ పార్టీ
దిశ, తెలంగాణ బ్యూరో: వచ్చే ఎన్నికలకు మేనిఫెస్టో సిద్ధం చేయడంపై బీజేపీ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే వరుస సమావేశాలతో మేనిఫెస్టో కమిటీ బిజీగా ఉంది. కాగా కాషాయ పార్టీ మేనిఫెస్టోకు ‘ఇంద్ర ధనుస్సు’ అనే పేరును ఫిక్స్ చేసినట్లు తెలిసింది. కాంగ్రెస్ సిక్స్ గ్యారెంటీస్‌కు దీటుగా ఏడు ప్రధాన అంశాలపై హామీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ప్రధాని మోడీ గ్యారంటీతో మేనిఫెస్టోను బీజేపీ ప్రకటించనుంది. మేనిఫెస్టోలో ఉచిత విద్య, ఉచిత వైద్యం, రైతు, మహిళలు, యువత, ఉద్యోగుల సంక్షేమానికి పెద్ద పీట వేయనున్నట్లు తెలుస్తోంది. త్వరలో ప్రధాని మోడీ టూర్ తెలంగాణలో సాగనుంది.
ఈ సందర్భంగా దీన్ని విడుదల చేయాలని బీజేపీ భావిస్తోంది. అందులో కొన్నింటిని కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మేనిఫెస్టోను రిలీజ్ చేయించాలని చూస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు ప్రకటించింది. ఇక బీఆర్ఎస్ ఈ నెల 15న మేనిఫెస్టో ప్రకటించనుంది. సీఎం కేసీఆర్ స్వయంగా మేనిఫెస్టో వెల్లడించనున్నారు. ఇందులో రైతులు, మహిళలకు పెద్ద ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇదిలాఉండగా బీజేపీ ప్రకటించబోయే మేనిఫెస్టోలో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఇదిలా ఉండగా అభ్యర్థుల ఎంపికపైనా బీజేపీ కసరత్తు సాగుతోంది.