భక్తులతో కిటకిటలాడుతున్న యాదగిరిగుట్ట ఆలయం

Update: 2025-01-01 10:11 GMT

దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి : నూతన సంవత్సర ప్రారంభం రోజు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో స్వామివారి దర్శనానికి విచ్చేయడంతో.. ఆలయ పరిసరాలు పూర్తిగా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. స్వామి వారి దర్శనం కోసం చాలా మంది భక్తులు క్యూ లైన్లలో వేచి చూస్తున్నారు. భక్తుల రద్దీ నేపథ్యంలో దర్శనానికి అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఉచిత దర్శనానికి మూడు గంటల సమయం పడుతుండగా.. ప్రత్యేక దర్శనానికి రెండు గంటల సమయం పడుతున్నట్లు భక్తులు చెబుతున్నారు.


Similar News