మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి : అడిషనల్ కలెక్టర్ బీఎస్ లతా

మహిళలు వంటింటి కే పరిమితం కాకుండా చైతన్యవంతులై అన్ని రంగాల్లో రాణించాలని సూర్యాపేట జిల్లా అడిషనల్ కలెక్టర్ బీఎస్ లతా అన్నారు.

Update: 2024-06-29 14:12 GMT

దిశ, సూర్యాపేట కలెక్టరేట్: మహిళలు వంటింటి కే పరిమితం కాకుండా చైతన్యవంతులై అన్ని రంగాల్లో రాణించాలని సూర్యాపేట జిల్లా అడిషనల్ కలెక్టర్ బీఎస్ లతా అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ శాఖలోని మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో జిల్లా సంక్షేమ అధికారి జ్యోతి పద్మ నేతృత్వంలో 2 నెలల పాటు ఏర్పాటు చేసిన బ్యూటీషియన్ శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు శనివారం కలెక్టరేట్ లో సర్టిఫికెట్స్ లను అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రస్తుత సమాజంలో మహిళలు తమకు లభించే ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగాలన్నారు. ఒడిదుడుకులు ఎదురైనా వెనుకంజ వేయకుండా తాము ఎంచుకున్న లక్ష్యం దిశగా అడుగులు వేయాలని, సమాజంలో ఉన్నత స్థానంలో నిలిచినపుడే మంచి గుర్తింపు లభిస్తుందన్నారు. మనం చేసే పని ఇతరులకు ఆదర్శంగా నిలవాలని, సమాజాభివృద్ధిలో భాగస్వాములు కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏ సీడీపీఓ రూప, మహిళా సాధికారత కేంద్రం డిస్ట్రిక్ట్ మిషన్ కో ఆర్డినేటర్ చైతన్య, జెండర్ స్పెషలిస్ట్ రేవతి, వినోద్, ఫైనాన్షియల్ లిటరసీ తేజస్విని, క్రాంతి, భవ్య, తదితరులు పాల్గొన్నారు.

Similar News