రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన సంఘటన బుధవారం మండల పరిధిలోని శిరసనగండ్ల గ్రామ సమీపంలో చోటుచేసుకుంది.
దిశ,నాగార్జునసాగర్ : రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన సంఘటన బుధవారం మండల పరిధిలోని శిరసనగండ్ల గ్రామ సమీపంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..బసిరెడ్డి పల్లి గ్రామానికి చెందిన ఆర్ఎంపి తుడుం లింగయ్య, దారం పరమేశులు గుర్రంపోడు మండలం ధర్వేశిపురంలో ఫంక్షన్ కు హాజరై తిరుగు ప్రయాణంలో ట్రాక్టర్ ట్రక్కును ఢీ కొట్టారు. దీంతో బైక్ పై ప్రయాణం చేస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ట్రాక్టర్ ను పోలీస్ స్టేషన్ కు తరలించి,మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నాగార్జునసాగర్ కమల నెహ్రూ హాస్పిటల్ కు తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పెద్దవూర ఎస్సై వీరబాబు తెలిపారు.