ప్రభుత్వ పాఠశాలకు తాళం వేసిన గ్రామస్తులు..

చింతపల్లి మండలం, నెల్వలపల్లి గ్రామస్థులు ప్రభుత్వ పాఠశాలకు తాళం

Update: 2024-10-26 10:48 GMT

దిశ,చింతపల్లి : చింతపల్లి మండలం, నెల్వలపల్లి గ్రామస్థులు ప్రభుత్వ పాఠశాలకు తాళం వేశారు. ప్రభుత్వం మా పాఠశాలకు కేటాయించిన టీచర్ ను మా పాఠశాలకే పంపాలని శనివారం రోజు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గజ్జల వెంకట్ రెడ్డి, గొడ్డటి మధు యాదవ్ మాట్లాడుతూ మా పాఠశాలలో ప్రాథమికోన్నత పాఠశాలలో 1వ తరగతి నుండి 8వ తరగతి వరకు ఉండగా ఉపాధ్యాయులు 7 సబ్జెక్ట్ బోధించాలి. కానీ మా పాఠశాలకు ప్రభుత్వం చే నిర్ణయించబడిన పోస్టులు 7 ఉండగా కేవలం ముగ్గురు ఉపాధ్యాయుల తో బోధన నిర్వహిస్తున్నారు. గ్రామస్తులు, తల్లిదండ్రులు, అధికారుల దృష్టికి తీసుకువెళ్లగా ప్రభుత్వం డీఎస్సీ నియామకాలలో ఎస్జీటీ టీచర్ ను ఈ నెల 17న నియమించారు. ఎటువంటి ప్రభుత్వ ఆదేశాలు లేకుండా ఆ టీచర్ ను పోలేపల్లి రాంనగర్ ప్రాథమిక పాఠశాల కు పంపడం జరిగింది. మా పాఠశాల కేటాయించిన టీచర్ ను మా స్కూల్ కే పంపాలని అధికారులను కోరుతున్నామన్నారు.అక్రమ డిప్యూటేషన్ పై పంపిన జిల్లా విద్యా అధికారి పై చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు, పేరెంట్స్, డిమాండ్ చేస్తున్నారు.


Similar News