Nakirekal MLA : ప్రజలకు హాని కలిగించే సిమెంట్ ఫ్యాక్టరీని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించం

ప్రజలకు హాని కలిగించే సిమెంట్ ఫ్యాక్టరీని ఎట్టి పరిస్థితుల్లో

Update: 2024-10-26 13:03 GMT

దిశ, రామన్నపేట : ప్రజలకు హాని కలిగించే సిమెంట్ ఫ్యాక్టరీని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదని (Nakirekal MLA)నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం తెలిపారు. శనివారం అఖిలపక్షం నాయకులతో కలిసి కలెక్టర్ హనుమంత్ కే జెండెగే జాయింట్ కలెక్టర్ బెన్స్ షాలోమ్ లను కలిశారు. అంబుజా-ఆదాని సిమెంట్ పరిశ్రమ ఏర్పాటు చేయాలని 23న జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో వచ్చిన పూర్తి స్థాయి నివేదికను యదావిధిగా పంపించి, పరిశ్రమ ఏర్పడకుండా చర్య తీసుకోవాలని కోరారు. పరిశ్రమ ఏర్పడితే కాలుష్యంతో ప్రజలు ఇబ్బంది పడే ప్రమాదముందని, అన్ని గ్రామాల ప్రజలు ముక్తకంఠంతో వ్యతిరేకించారని వచ్చిన ప్రజాభిప్రాయ సేకరణను వాస్తవికంగా పంపిస్తే పరిశ్రమ ఏర్పడదని అన్నారు.

రామన్నపేట మండల ప్రజల పక్షాన నిలబడతానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు మేక అశోక్ రెడ్డి, పర్యావరణ పరిరక్షణ వేదిక మండల కన్వీనర్ జల్లెల పెంటయ్య, కో-కన్వీనర్ యం.డి రెహాన్, కాంగ్రేస్ నాయకులు జినుకల ప్రభాకర్, పూస బాలకృషన్, బీజేపీ మండల అధ్యక్షుడు పల్లపు దుర్గయ్య, సీపీఐ మండల కార్యదర్శి ఊట్కూరి నర్సింహ, టీడీపీ మండల నాయకుడు ఫజల్ బేగ్, అఖిలపక్షం నాయకులు బోయిని ఆనంద్, యండి. అక్రం, కందుల హనుమంతు, జమీరొద్దీన్, గుర్క శివ, సుక్క శ్రవణ్, గుండాల బిక్షం తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News