Kancharla Bhupal Reddy అరెస్టులకు భయపడేది లేదు...వెనక్కి తగ్గేది లేదు.

ప్రజల పక్షాన నిలిచే మాలాంటి నాయకులను అరెస్టు చేయడం

Update: 2024-10-26 12:54 GMT

దిశ, మునుగోడు :  ప్రజల పక్షాన నిలిచే మాలాంటి నాయకులను అరెస్టు చేయడం సరికాదని, అరెస్టుకు భయపడేది లేదని నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి (Kancharla Bhupal Reddy)అన్నారు. బెటాలియన్ పోలీసుల కుటుంబాలకు న్యాయం జరిగే వరకు వెనక్కి తగ్గేది లేదని అన్నారు. శనివారం మునుగోడు పోలీస్ స్టేషన్ లో ఆయన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన జివో వల్ల బెటాలియన్ పోలీసులకు సెలవులు దొరకక కుటుంబాలకు సమయం ఇవ్వలేదని పోలిసుల భార్యలు ధర్నాలు చేస్తుంటే వారి పట్ల ప్రభుత్వం మొండి వైఖరి అవలంబిస్తుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పోలిసుల భార్యలు దర్నాలు చేస్తుంటే వారి భర్తలకు సస్పెన్షన్ వేటు వేయడం ఎంత వరకు సమంజసమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వారి పట్ల కక్షసాదింపు చర్యలకు పాల్పడడం సరికాదని వెంటనే వారిపై ఉన్న సస్పెన్షన్ (Suspension)బేషరత్తుగా ఎత్తివేయాలని ఆయన డిమాండ్ చేశారు.

నల్లగొండలోని 12వ బెటాలియన్ పోలిసుల సమస్యలను అడిగి తెలుసుకునేందుకు వెళ్తున్న తనకు అనుమతి ఇవ్వకుండా అరెస్టు చేసి మునుగోడు పోలిస్ స్టేషన్ కు తరలించారన్నారు. అరెస్టులకు భయపడేది లేదని పోలీస్ కుటుంబాలకు న్యాయం జరిగే వరకు వారికి అండగా ఉంటానన్నారు. సివిల్ పోలిసులు కూడా బెటాలియన్ పోలిసులకు మద్దతూ పలికి సహకరించాలని కోరారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో స్టేషన్ లో నిరసన తెలిపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చెరుకు సుధాకర్, నల్లగొండ మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి, నాయకులు మారగోని అంజయ్య, ఐతగోని విజయ్ కుమార్, ఈధ శరత్, గజ్జేల బాలరాజు, దోటి కర్ణాకర్, మేకల శ్రీనివాస్ రెడ్డి, ఎల్లంకి యాదయ్య, వంటేపాక వెంకన్న, వరంగంటి శంకర్, కంభంపాటి అంజయ్య, పందుల పాపయ్య, బోయపర్తి సురేందర్, తదితరులు పాల్గోన్నారు.


Similar News